Ram Pothineni : డబుల్ ఇస్మార్ట్ కోసం నెల రోజుల్లోనే అన్ని కేజీలు తగ్గాను : రామ్ పోతినేని

‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ సందర్భంగా రామ్‌ పోతినేని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో సినిమా కోసం భారీగా బరువు తగ్గినట్లు వెల్లడించారు.' 'స్కంద’లో 86 కేజీలు ఉన్నాను. ఇప్పుడు 68కి వచ్చాను. నెల రోజుల్లో 18 కేజీలు తగ్గాను' అని అన్నారు.

New Update
Ram Pothineni : డబుల్ ఇస్మార్ట్ కోసం నెల రోజుల్లోనే అన్ని కేజీలు తగ్గాను : రామ్ పోతినేని

Ram Pothineni Interview : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ మూవీపై భారీగా అంచనాలున్న సంగతి తెలిసిందే. 'ఇస్మార్ట్ శంకర్' కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్ పోతినేని డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చేశారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.

ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో రామ్‌ పోతినేని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా రామ్ ఈ సినిమా కోసం భారీగా బరువు తగ్గినట్లు వెల్లడించారు.‘స్కంద’ టూ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ లుక్‌ ట్రాన్స్ఫర్మేషన్ గురించి రామ్ మాట్లాడుతూ.." ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు క్లైమాక్స్‌ హైలైట్‌. మళ్లీ అలాంటి లుక్‌లోనే దాని సీక్వెల్లో కనిపించాలి.

Also Read : నటుడు బిత్తిరి సత్తిపై కేసు నమోదు

‘స్కంద’ షూటింగ్ పూర్తికాగానే విదేశాలకు వెళ్లి.. అక్కడ వ్యాయామం చేసి శంకర్‌ లుక్‌లోకి వచ్చా. ‘స్కంద’లో 86 కేజీలు ఉన్నాను. ఇప్పుడు 68కి వచ్చాను. నెల రోజుల్లో 18 కేజీలు తగ్గాను" అని అన్నారు. అంతేకాకుండా ఈ మూవీ ఎమోషన్స్‌తో ఉంటుందని, అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని తన ఆశాభావం వ్యక్తం చేశాడు.

Advertisment
తాజా కథనాలు