Ayodhya Ram Mandir : అయోధ్య రాముడికి కలశ పూజ...గర్భగుడిలో ప్రత్యేక హారతి..!!

అయోధ్య రామమందిరంలో రాంలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన క్రతువులు కొనసాగుతున్నాయి. సరయు నది తీరంలో బుధవారం కలశ పూజ నిర్వహించారు. గర్భగుడిలో రాముడి విగ్రహం ప్రతిష్టించే చోట పూజలు చేశారు. గురువారం గర్భగుడిలోకి బాలరాముడి విగ్రహాన్ని చేర్చుతారు.

New Update
Ayodhya Ram Mandir : అయోధ్య రాముడికి కలశ పూజ...గర్భగుడిలో ప్రత్యేక హారతి..!!

Ayodhya Ram Mandir :  అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రమ ప్రాణప్రతిష్టకు క్రతువులు జరుగుతున్నాయి. మంగళవారం సరయు నది తీరంలో దీపోత్సవం, హారతి వంటి కార్యక్రమాలను నిర్వహించారు. బుధవారం కలశపూజ చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు (Sri Rama Janmabhoomi Tirtha Kshetra Trust)సభ్యుడు అనిల్ మిశ్రా, ఆయన భార్య ఇతరులు సరయు నది (Sarayu River)తీరంలో ఈ కలశ పూజను నిర్వహించారు. తర్వాత కలశాలలో సరయు నది నీటిని రామమందిరానికి తీసుకెళ్లారు.

మరోవైపు అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి గురువారం బాలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. ఈ నేపథ్యంలో గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రదేశం దగ్గర శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్,పూజారి సునీల్ దాస్ పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. ప్రాణప్రతిష్ట జరిగే 22వ తేదీ వరకు క్రతువులు జరుగుతాయని ట్రస్టు కార్యదర్శి తెలిపారు. ఈ క్రతువులను నిర్వహించేందుకు సుమారు 121 మంది పురోహితులు వచ్చినట్లు చెప్పారు. అయోధ్యలోని కరసేవకపురాన్ని సందర్శించి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు.

ఇది కూడా చదవండి: వామ్మో ఇది మాముల వైరస్‌ కాదు.. సోకితే చావే.. అసలు చైనా ఏం చేస్తోంది?

జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి 1గంట వరకు బాలరాముడి విగ్రహప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. జనవరి 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదని 23 నుంచి భక్తులకు రాంలల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ఇప్పటికే ట్రస్టు ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు