Ayodhya Ram Mandhir: దేశ వ్యాప్తంగానే కాకుండా..ప్రపంచ వ్యాప్తంగా ఉన్నహిందువులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర (Ayodhya Ram Mandir)ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 22న జరగబోతోంది. ఈ వేడుకల కోసం ఆ అయోధ్య పురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ, సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
దీపాపు కాంతుల వెలుగులో..
ఈ క్రమంలో ఆలయం రాత్రి సమయంలో (Night View) ఎలా ఉంటుందనే విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. రామ మందిరం రాత్రి పూట ఎలా ఉంటుందో చూపించే చిత్రాలను షేర్ చేసింది. రాత్రి సమయంలో దీపాపు కాంతుల వెలుగులో మందిరం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది.
ఆ దృశ్యాలను చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. దీనికి సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఎన్నో దశాబ్దాల కల అయినటువంటి రామ మందిరాన్ని 2500 ఏళ్లు నిలిచి ఉండేటట్లు అద్భుతంగా మలిచారు. ఈ మందిరంలో ఎక్కడా కూడా ఇనుము అనేది వాడకుండా భూమిలో వేసిన తరువాత రాళ్లగా మారే మిశ్రమాన్ని వాడి మందిరాన్ని నిర్మిస్తున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద మూడో హిందూ దేవాలయంగా ఇది రూపుదిద్దుకుంటుంది. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం.. ఈ అయోధ్య రామ మందిరం.
Also read: నేను ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయను: లగడపాటి రాజగోపాల్