/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ram-2-jpg.webp)
Ram charan: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబయిలో తన కుటుంబంతో కలిసి మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. భార్య ఉపాసన, కుమార్తె క్లీంకారలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. మెగా ప్రిన్సెస్ క్లీంకార పుట్టి ఆరు నెలలు అయిన సందర్భంగా అమ్మవారి ఆశీస్సుల కోసం ముంబయిలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు.
Also Read: మా అమ్మ, భార్యకు ఏదైనా జరిగి ఉంటే.. అమర్ దీప్ ఎమోషనల్ వీడియో..!
Idol @AlwaysRamCharan Along with @upasanakonidela vadhina & #KlinKaara visited Mahalakshmi Temple in Mumbai !! pic.twitter.com/mUaxMQuHTW
— Ram (@HereFoRamCharan) December 20, 2023
చాలా సింపుల్ దుస్తుల్లో ఆలయానికి వెళ్లారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు. ఇద్దరు కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి వారిని ఆశీర్వదించారు. రామ్ చరణ్ రాకతో ఆలయంలో సందడి వాతవారణం నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రామ్ చరణ్, ఉపాసన లకి దాదాపు 10 సంవత్సరాల తర్వాత పుట్టింది క్లీంకార. మెగా ప్రిన్సెస్ పుట్టి ఆరె నెలలు కావొస్తోన్న బేబి ఫేస్ ను ఇంత వరకు ఎక్కడా చూపించకుండా చాలా జాగ్రత్తపడుతున్నారు. బాలసారె చేసినప్పుడు కానీ, ఉయ్యాలలో వేసినప్పుడు కానీ పాప ఫేస్ మాత్రం అసలు కనపడకుండా చూసుకున్నారు. ఫ్యామిలీ ఫొటో దిగిన సరే బేబి మొహం కనపడకుండా లవ్ సింబల్ వేసేసేవారు. అయితే, ఫ్యాన్స్ మాత్రం మెగా ప్రిన్సెస్ ను ఎప్పుడు చూపిస్తారో అంటూ ఎదురుచూస్తున్నారు.