/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ram-charan-1.webp)
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తిరుమలకు చేరుకున్నారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న రామ్ చరణ్ ను చూసేందుకు ఆయన అభిమానులు ఎగబడ్డారు. కేరింతలు కొడుతు రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికారు. ఉత్సాహంతో రామ్ చరణ్ తో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నం చేశారు. విమానశ్రమయం నుంచి రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లారు.
కాగా రేపు అనగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబంతో కలిసి రామ్ చరణ్ తిరుమలకు వచ్చారు. తమతోపాటు తన కూతురు క్లిన్ కారాను కూడా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున వీఐపీ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Ram Charan And Upasana Konidela Reaches Tirumala With Daughter !! #Tirupati #tirumala #RamCharan pic.twitter.com/HozAhSg0Ww
— Sanjay sahuu (@sanjunamana) March 26, 2024
ఇది కూడా చదవండి: ఒకే కుటుంబం..12,00మంది ఓటర్లు..ఆ ఇంటికి క్యూ కట్టిన అభ్యర్థులు.!