Ram Charan Wedding Anniversery: వాళ్ళిద్దరి పెళ్లిరోజు.. కూతురు ఫోటో వైరల్.. మెగా క్రేజ్ మాములుగా లేదుగా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల పెళ్లిరోజు ఈరోజు. అయితే, వారిద్దరికీ శుభాకాంక్షలు చెప్పడానికి మెగా అభిమానులు వారి గారాల పట్టి క్లింకార ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లింకార ఫోటోలను కూడా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు 

Ram Charan Wedding Anniversery: వాళ్ళిద్దరి పెళ్లిరోజు.. కూతురు ఫోటో వైరల్.. మెగా క్రేజ్ మాములుగా లేదుగా..
New Update

Ram Charan Wedding Anniversery: ఎవరిదైనా పెళ్లిరోజు అంటే ఆ భార్యా భర్తల గురించి చెప్పుకుంటారు. సెలబ్రిటీలయితే వారి ఫోటోలను అభిమానులు షేర్ చేసి విషెస్ చెబుతూ ఆనందం పంచుకుంటారు. కానీ, ఆ మెగా జంట పెళ్లిరోజు అయితే.. వారి చిన్నారి ఫోటోను షేర్ చేస్తూ.. సందడి చేస్తున్నారు మెగా అభిమానులు. అవును.. రామ్ చరణ్, ఉపాసనల పెళ్లిరోజు ఈరోజు. అయితే, నిన్న ఉపాసన తన ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ లో తమ గారాల పట్టి క్లింకారతో వారిద్దరూ ఉన్న ఫోటోను షేర్ చేశారు. దానికి 12 ఏళ్ల మా వైవాహిక జీవితం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. 

Ram Charan Wedding Anniversery 1

ఇదిలా ఉంటె ఈరోజు ఉదయం నుంచి ఇంకో ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రామ్ చరణ్ ఒక పాపను ఎత్తుకుని ఆడిస్తున్నారు ఆ ఫొటోలో. ఆ ఫోటోను అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోనే ట్రేండింగ్ లో ఉంది. 

తాత కాదు చిరుత..
Ram Charan Wedding Anniversery: ఇక మరోవైపు రామ్ చరణ్ తన తండ్రి, చిరంజీవి.. తనయ క్లింకార ఉన్న ఒక ఫొటోతో పబ్లిష్ అయిన ఆర్టికల్ పేజీ ఒకటి కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ పేజీలో ఉన్న కొన్ని లైన్స్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. “నా కూతురు క్లింకార ఆయన (చిరంజీవి) వద్ద ఉంటే .. క్లిం కు పెద్దన్నలా మారిపోతారు. తను నాన్నను చేతులతో కొడుతుంది.. గిల్లుతుంది. అలా ఆయనను చూడటం చాలా క్యూట్ గా అనిపిస్తుంది.” అని చెప్పారు. అంతే కాదు.. తనను తాత అని కాదని.. చిరుత అని పిలవమని తన మానమరాలికి చెబుతున్నారట చిరంజీవి. ఎందుకంటే, చిరు తాతయ్య అని అర్ధం వచ్చేలా.. అలా పిలవాలని అంటున్నారట. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు ఆ క్లిప్ లో ఉన్నాయి దీంతో దీనిని కూడా విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు. 

Ram Charan Weeding Anniversery 2

Ram Charan Wedding Anniversery: మొత్తంగా రామ్ చరణ్ పెళ్లిరోజు సందడి అంతా క్లింకార చుట్టూ తిరుగుతుండడం ఒక విశేషమైతే.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాకా వీరి పెళ్లిరోజు రావడంతో మరింత సందడిగా మారింది పరిస్థితి. పవన్ కళ్యాణ్ తో క్లింకార ఉన్న ఫోటోలను కూడా అభిమానులు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని.. సంతోషాన్ని చాటుకుంటున్నారు మెగా అభిమానులు. 

#ram-charan #upasana-konidela
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe