Ram Charan : అంబానీ ఫ్యామిలీపై రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్.. నెట్టింట వైరల్!

అంబానీ ఇంట ఇటీవల జరిగిన పెళ్లి వేడుకలో రామ్ చరణ్ సతీ సమేతంగా సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మెగా హీరో అనంత్‌-రాధికలకు విషెస్‌ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఈ మేరకు అంబానీ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు.

New Update
Ram Charan : అంబానీ ఫ్యామిలీపై రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్.. నెట్టింట వైరల్!

Ram Charan Special Post On Ambani Family : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు ఇటీవల కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. జులై 12న అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ మూడు ముళ్ళ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు హాజరయ్యేందుకు ప్రపంచ నలుమూలల నుంచి దేశాధినేతలు, సినీ తారలు, ప్రముఖులు, క్రికెటర్లు వచ్చారు.

ఇప్పటికే ఈ వెడ్డింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి వెళ్లిన హీరోల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. సతీ సమేతంగా చరణ్ ఈ వేడుకకు హాజరయ్యాడు. అయితే తాజాగా రామ్‌చరణ్‌.. అనంత్‌-రాధికలకు విషెస్‌ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Also Read : ‘పుష్ప 2’ కు పోటీగా ‘కన్నప్ప’.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ రిలీజ్ అప్పుడే?

ఆ పోస్ట్ లో.." అనంత్‌.. నీ మంచి మనసు మమ్మల్ని అబ్బురపరిచింది. నీతాజీ.. ఓ కుమార్తెని కుటుంబంలోకి ఆహ్వానించడంలో మీరు చూపిన భారతీయ సంస్కృతి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. ముకేశ్‌జీ.. మీ అసాధారణమైన ఆతిథ్యం, నిరాడంబరత నుంచి మేం ఎంతో స్ఫూర్తి పొందాం" అని పేర్కొంటూ అంబానీ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#ram-charan #annat-ambani-radhika
Advertisment
Advertisment
తాజా కథనాలు