Raksha Bandhan : భర్తకు భార్య రాఖీ కట్టొచ్చా? పురాణాలు ఏం చెబుతున్నాయంటే?

రక్షాబంధన్ అనేది కేవలం అన్నదమ్ముల ప్రేమను మాత్రమే సూచించేది కాదు. భార్య భర్తకు కూడా రాఖీని కట్టవచ్చు. పురాణాలలో శచీదేవి భర్తకు కట్టిన రక్ష దేవేంద్రుడిని యుద్ధంలో గెలిపించిందని చెబుతారు. అలా తోబుట్టువులు, ప్రేమించిన వారు విజయం దిశగా అడుగులు వేయాలని రక్షను కడతారు.

Raksha Bandhan : భర్తకు భార్య రాఖీ కట్టొచ్చా? పురాణాలు ఏం చెబుతున్నాయంటే?
New Update

Raksha Bandhan Facts : హిందూ మతం (Hinduism) లో అన్నా చెల్లెల్ల అనుబంధానికి, ప్రేమకు చిహ్నంగా రాఖీ (Rakhi) పండుగను భావిస్తారు. 'రక్ష' అంటే రక్షించడం, 'బంధన్' అంటే సూత్రం అని అర్థం. అక్కాచెల్లెల్లు తమ అన్నాతమ్ముళ్ళ చేతికి రక్షగా రాఖీని కడతారు. దానికి ప్రతిగా సోదరులు వారికి ఎల్లవేళలా తోడుగా, రక్షగా ఉంటామని వాగ్దానం చేస్తారు. ప్రపంచంలో భార్య భర్తలు (Wife & Husband) విడిపోయిన రోజులు ఉన్నాయేమో కానీ.. అన్నా చెల్లెలు విడిపోయినట్లు చరిత్రలోనే లేదు. అతంటి నిస్వార్ధమైన గొప్ప బంధం అన్నాచెల్లెలి అనుబంధం.

భర్తకు కూడా రాఖీ కట్టొచ్చు..

అయితే రక్షాబంధన్ అనేది కేవలం అన్నదమ్ముల ప్రేమను మాత్రమే సూచించేది కాదు. ఈ రక్షా బంధనాన్ని మనం ప్రేమించే ఎవరికైనా కట్టవచ్చు. భార్యలు.. భర్త క్షేమమం, పురోగతి, తలపెట్టిన పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ చేతికి రక్షగా ఈ బంధనాన్ని కొట్టొచ్చని పండితులు చెబుతున్నారు

publive-image

భర్త కోసం శచీదేవి రక్ష

పురాణాల ప్రకారం.. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య 12 సంవత్సరాల భీకర యుద్ధం జరిగింది. ఆ సమయంలో యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై ఒక చోట తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను గమనించిన ఇంద్రాణి యుద్ధంలో పోరాడడానికి భర్తలో ఉత్సాహాన్ని నింపుతుంది. సరిగ్గా ఆరోజు రాఖీ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి దేవేంద్రుడి చేతికి రక్ష కట్టి యుద్దానికి పంపుతుంది. అలా వెళ్లిన దేవేంద్రుడు సమరంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. ఆ రోజు శచీదేవి కట్టిన రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా జరుపుకుంటారని చెబుతారు. తోబుట్టువులు, ప్రేమించిన వారు విజయం దిశగా అడుగులు వేయాలని, అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని రక్షగా కట్టే బంధనమే ఈ రక్షాబంధన్.

Also Read: Hari Hara Veera Mallu : ‘హరిహరవీరమల్లు' కొత్త పోస్టర్.. బంగారు చీరలో మెరిసిపోతున్న నిధి అగర్వాల్‌ - Rtvlive.com

#rakhi-festival #brother-and-sister #raksha-bandhan-2024 #wife-and-husband
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe