Raksabandhan: ఈ సమయంలో సోదరులకు రాఖీ కడితే అంతే..!!

శ్రావణ పౌర్ణమిని రక్షాబంధనంగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి చిహ్నం రాఖీ పండుగ. సోదరీ సోదరులు ఒకరి మేలు మరొకరు కోరుకునే సందర్భం. ఈ రోజున సోదరీమణులు..తమ సోదరులకు రక్షాసూత్రాన్ని కట్టి వారికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును కోరుకుంటారు. అంతేకాదు.. అన్నదమ్ములు అండగా ఉన్నారని ఆడపిల్లలకు ధీమా కలిగించే పండుగే ఈ రాఖీ పౌర్ణమి.

New Update
Raksabandhan: ఈ సమయంలో సోదరులకు రాఖీ కడితే అంతే..!!

రాఖీ కట్టొచ్చా..?

శ్రావణ పౌర్ణమిని రక్షాబంధనంగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది. రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి చిహ్నం. సోదరీ సోదరులు ఒకరి మేలు మరొకరు కోరుకునే సందర్భం. ఈ రోజున సోదరీమణులు..తమ సోదరులకు రక్షాసూత్రాన్ని కట్టి వారికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును కోరుకుంటారు. అలాగే అన్నదమ్ములు తమకు అండగా ఉన్నారని ఆడపిల్లలకు ధీమా కలిగించే పండుగే ఈ రాఖీ పౌర్ణమి. అన్నా చెల్లెళ్ల అనుబంధాలను మరింత పెంచుతూ, తమ బాధ్యతలను గుర్తు చేసే వేడుక రక్షాబంధనం.రాఖీ పండుగను జరుపుకోవడానికి సంబంధించిన పౌరాణిక కథలు ఎన్నో వాడుకలో ఉన్నాయి. దేవతామూర్తుల కాలం నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నారని నమ్మకం ఉంది.

ఎప్పుడు.. ఎలా..?

అయితే ..ఈసారి రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. 30న బుధవారమా..?లేక 31న గురువారం జరుపుకోవాలా..?
అన్నది కన్ఫ్యూజన్‌గా మారింది. ఎందుకంటే ఈసారి పౌర్ణమి రెండ్రోజుల్లో వచ్చినట్టు చెబుతున్నారు పండితులు. ఆగస్ట్‌ 30న ఉదయం 10.58కి పౌర్ణమి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఆగస్ట్‌ 31 గురువారం ఉదయం 7.05కు ముగుస్తుంది. ఐతే 30న పౌర్ణమి గడియలున్నప్పటికీ రాత్రి 9.01వరకు భద్రకాలం ఉంటుందని..ఆ టైమ్‌లో అస్సలు రాఖీ కట్టకూడదని చెబుతున్నారు పండితులు.

ఆ టైంలో రాఖీ కట్టాలి..!!

ఈనెల (బుధవారం) 30న ఉదయం 10.58నుంచి రాత్రి 09.01వరకు భద్రుని నీడ కమ్ముకుంటుంది. ఆ సమయంలో రాఖీ కట్టకూడదు. ఆ తర్వాత అంటే బుధవారం రాత్రి 09.02 నుంచి మరుసటిరోజు ఉదయం అంటే ఆగస్ట్‌ 31 గురువారం రక్షాబంధన్‌ కట్టొచ్చని సూచిస్తున్నారు పండితులు. గురువారం ఉదయం ఆరున్నర నుంచి 9.45, అలాగే 10.50 నుంచి11.50మధ్య..మళ్లీ మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు..అలాగే సాయంత్రం 3.45 నుంచి 6గంటల వరకు రాఖీ కట్టొచ్చని చెబుతున్నారు.

పండితులు హెచ్చరిక

భద్రకాలంలో రాఖీ కడితే దోషమని..సోదరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం లంకేశుడికి తన సోదరి శూర్పణఖ భద్రకాలంలో రాఖీ కట్టిందట. అప్పటినుంచే లంకకు చెడు దశ ప్రారంభమైందని..రావణుడి సామ్రాజ్యం అంతం కావడానికి ఆ భద్రకాలమే కారణమని చెబుతారు. పొరపాటున కూడా ఆ భద్రకాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు, సమస్యలు వస్తాయని..ఆ సమయంలో రాఖీ కట్టొద్దని పండితులు హెచ్చరిస్తున్నారు. శ్రీహరిని విడిపించడానికి బలి చక్రవర్తికి లక్షీదేవి రక్షాబంధనం కట్టిందని భవిష్య పురాణం చెబుతుంది.

యేన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః
తేనత్వామభిబధ్నామి రక్షే మా చలమాచల!!

ఈ శ్లోకం చదువుతూ సోదరులకు రాఖీ కట్టాలి. దీని శక్తితో నువ్వు చల్లగా వర్ధిల్లుతూ ఉండాలని పై శ్లోకానికి అర్థం.

Advertisment
Advertisment
తాజా కథనాలు