Konaseema: ప్రమాదంలో రాజోలు ఏటిగట్టు.. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలు..!

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవి భారీ వర్షాలకు ముంపు బారిన పడింది. బలహీనంగా ఉన్న ఏటిగట్లపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు. తక్షణమే ఏటి గట్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

New Update
Konaseema: ప్రమాదంలో రాజోలు ఏటిగట్టు.. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలు..!

Konaseema district: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఏటిగట్టు ప్రమాదం అంచుల్లో ఉంది. ఏటిగట్లు ఆనుకుని ఉన్న రాజోలు, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలను రాజోలు దీవిగా వ్యవహరించటం జరుగుతుంది. ఈ దీవికి రక్షణ కవచంలా వశిష్ట ఎడమ, వైనతేయ కుడి ఏటిగట్లు ఉన్నాయి. అయితే,1986 ఆగస్టులో వచ్చిన తీవ్రమైన వరదకు పి.గన్నవరం మండలంలో నాగుల్లంక గ్రామం వద్ద, 2006 ఆగస్టులో వచ్చిన వరదలకు మొండెపులంక వద్ద వశిష్ట ఎడమ ఏటిగట్టుకు భారీగండ్లు పడటంతో రాజోలు దీవి ముంపు బారిన పడింది.

Also Read: ఇండియా కూటమికి జగన్ అవసరం లేదు.. మాజీ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్..!

ఈ రెండుసార్లు వశిష్ట ఎడమ ఏటిగట్టుకు గండ్లు పడినప్పుడు వరదనీరు పోటెత్తి రాజోలు దీవి ముంపులో చిక్కుకుని ప్రజలు చాలా ఇబ్బందికి గురయ్యారు. నేటికీ చాలా చోట్ల ఏటిగట్టు బలహీనంగానే ఉంది. అంతర్వేది వరకు ఉన్న సుమారు 40 కి.మీ ఏటిగట్టులో దాదాపు 15 కి.మీ పైన ఏటిగట్టు నేటికి అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలుస్తుంది. లంకలగన్నవరం, నాగుల్లంక, తాటిపాక, సోంపల్లి, పొదలాడ, రాజోలు, రామరాజులంక, అప్పని రామునీ లంక టేకిశెట్టి పాలెం, సఖినేటిపల్లి లంక ప్రాంతాల్లో ఏటిగట్టును పటిష్ట పర్చాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు.

2002లో వరదలు సృష్టించిన భయానక పరిస్థితులు మర్చిపోకుండానే, మరలా గోదావరిలో ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరడంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. 2022 జూలై నెలలో గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాజోలు వద్ద వరదనీరు వశిష్ట ఎడమ ఏటిగట్టు మీదకు చేరింది. ఆ సమయంలో హెడ్వర్క్స్ ఇంజినీరింగ్ అధి కారులు ఇసుకబస్తాలు వేసి తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టారు. అప్పటి సీఎం జగన్ వచ్చి తక్షణమే ఏటి గట్లు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

బలహీనంగా ఉన్న ఏటిగట్లను గుర్తించిన ఇంజినీరింగ్ అధికారులు అప్పటి వైసీపీ ప్రభుత్వానికి రూ. 45 కోట్లతో ప్రతిపాదనలు పంపినా నిధులు ఇచ్చింది లేదు. అప్పటి పోలీసు, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, యువకులు ప్రాణాలకు తెగించి రాత్రింబవళ్ళు ఏటిగట్టు పైనే ఉండి కిలోమీట్ల మేర ఇసుక, సిమెంట్ బస్తాలు వేసి రాజోలు దీవిని కాపాడ గలిగారు. కాగా, భారీ వర్షాలకు రాజోలు ఏటిగట్టు ప్రమాదం అంచుల్లో ఉందని.. కూటమి ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు