రాజీవ్ గాంధీ పొలిటికల్ లైఫ్ అత్యంత క్రూరంగా ముగిసింది.... !

తన భర్త రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం అత్యంత క్రూరమైన పద్దతిలో ముగిసి పోయిందని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. 25వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్ని సోనియాగాంధీ మాట్లాడుతూ... దేశ సేవలో ఆయన కొంత కాలమే గడిపినప్పటికీ ఆయన ఎన్నో కీలకమైన మైలు రాళ్లను సాధించారని పేర్కొన్నారు.

author-image
By G Ramu
New Update
రాజీవ్ గాంధీ పొలిటికల్ లైఫ్ అత్యంత క్రూరంగా ముగిసింది.... !

తన భర్త రాజీవ్ గాంధీ(Rajeev Gandhi) రాజకీయ జీవితం(Political life) అత్యంత క్రూరమైన పద్దతిలో ముగిసి పోయిందని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ(Sonia Gandhi) అన్నారు. దేశ సేవలో జీవితాన్ని గడిపిన అతి కొద్ది కాలంలోనే ఆయన ఎన్నో విజయాలను సాధించారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత(Woman empowerment) కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఆమె అన్నారు. 25వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఢిల్లీలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్ని సోనియాగాంధీ మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం అత్యంత క్రూరంగా ముగిసిందని పేర్కొన్నారు. దేశ సేవలో ఆయన కొంత కాలమే గడిపినప్పటికీ ఆయన ఎన్నో కీలకమైన మైలు రాళ్లను సాధించారని పేర్కొన్నారు. దేశ వైవిధ్యం పట్ల ఆయన చాలా సున్నితంగా ఉండేవారని అన్నారు. దేశ సేవకు తక్కువ సమయం లభించినప్పటికీ ఆయన లెక్కలేనన్ని విజయాలు సాధించాడన్నారు.

ముఖ్యంగా ఆయన మహిళా సాధికారతకు అంకిత భావంతో పని చేశారన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీల్లో మహిళలకు 33.3శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేశారన్నారు. ఈ రోజు దేశ వ్యాప్తంగా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల్లో 15 లక్షలకు పైగా మహిళా ప్రజాప్రతినిధులు వున్నారంటే దానికి రాజీవ్ గాంధీ చేసిన సంస్కరణలే కారణమన్నారు.

దేశంలో ఓటు హక్కును 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీదేనన్నారు. దేశంలో విద్వేషాలను పెంచి, సమాజాన్ని విభజించి, మతోన్మాదం, పక్షపాత రాజకీయాలు మరింత యాక్టివ్ గా మారుతున్న తరుణంలో మత సామరస్యం, శాంతి, జాతీయ సమైక్యత అనే ఆశయాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని వెల్లడించారు.

దివంగత మాజీ ప్రధాని రాహుల్ గాంధీ 20 అగస్టు 1944న జన్మించారు. 1984లో ఇంధిరా గాంధీ మరణం తర్వాత ఆయన ప్రధాన మంత్రి అయ్యారు. దేశంలో అత్యంత చిన్న వయస్సులో ప్రధాని పదవి చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 21 మే 1991 తమిళనాడులో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు ఆయన్ని కాల్చి చంపారు.

Advertisment
తాజా కథనాలు