/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/akilesh-jpg.webp)
సూపర్ స్ఠార్ రజనీకాంత్(Rajani kanth) యూపీ పర్యటనలో బిజీగా వున్నారు. తలైవా రజనీకాంత్ శనివారం పలువురు ప్రముఖులను కలిశారు. నిన్న మొదట యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్(Anandi ben patel) తో రజనీ భేటీ అయ్యారు. ఆ తర్వాత సాయంత్రం ఆయన సీఎం యోగీ ఆదిత్య నాథ్(yogi adityanath)ను కలిశారు. తాజాగా ఆదివారం ఆయన ప్రతిపక్షనేత, సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్(akilesh yadav)ను కలిశారు.
సీఎంను కలిసిన సందర్బంలో సీఎం యోగీ పాదాలకు రజనీకాంత్ నమస్కారం చేశారు. దానిపై రజనీకాంత్ పై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ అఖిలేశ్ యాదవ్ ను కలిసి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి కొద్ది సేపు భేటీ అయ్యారు. అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. తొమ్మిదేండ్ల క్రితం ముంబైలోని ఓ కార్యక్రమంలో తాను మొదటి సారి అఖిలేశ్ యాదవ్ ను కలిశానన్నారు.
అప్పటి నుంచి తామిద్దరమూ మంచి స్నేహితులం అయ్యామన్నారు. తాము తరుచుగా ఫోన్ లో కాంటాక్ట్ లో వుంటామన్నారు. ఐదేండ్ల క్రితం ఓ సినిమా షూటింగ నిమిత్తం తాను యూపీకి వచ్చానన్నారు. కానీ ఆ సమయంలో అఖిలేశ్ ను కలవలేక పోయానన్నారు. మళ్లీ ఇప్పుడు యూపీకి రావడం, అఖిలేశ్ ను కలవడం తనకు చాలా సంతోషంగా వుందన్నారు.
రజనీకాంత్‌తో భేటీ గురించి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. తాను మైసూర్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్‌ని తెరపై చూశానన్నారు. అప్పుడు కలిగిన ఆనందం ఇప్పటికీ చెక్కుచెదరలేదని ఎమోషనల్ అయ్యారు. 9 ఏండ్ల క్రితం తాము వ్యక్తిగతంగా కలుసుకున్నామని చెప్పారు. అప్పటి నుండి తాము స్నేహితులుగా వున్నామన్నారు. ఆయన మాయావతిని కూడా కలుస్తారని తెలుస్తోంది.
మరో వైపు రజనీకాంత్ అయోధ్యకు బయలు దేరినట్టు వార్తలు వస్తున్నాయి. మరి కొద్ద సేపల్లో అయోధ్య చేరుకుంటారు. రాముల వారి దర్శనానికి రజనీకాంత్ వస్తుండటం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ అన్నారు. ఆలయంలో రజినీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు.