Rajamouli: గామి ట్రైలర్ పై రాజమౌళి ప్రశంసలు .. వైరలవుతున్న పోస్ట్

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గామి’. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి సైతం ‘గామి’ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ అభినందించారు.

New Update
Rajamouli: గామి ట్రైలర్ పై రాజమౌళి ప్రశంసలు .. వైరలవుతున్న పోస్ట్

Rajamouli: విద్యాధర్ కగిత దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గామి'. గత నాలుగేళ్లుగా భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముకుందు రానుంది. సెల్యులాయిడ్ బ్యానర్ పై కార్తీక్ శబరీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరీ , ఎంజీ అభినయ, మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Also Read: Samantha: సమంతతో తిరుమలలో ప్రత్యక్షమైన ప్రీతం.. మరోసారి టాలీవుడ్ లో గుసగుసలు

డిఫరెంట్ కథనంతో రూపొందిన ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు విశ్వక్. అంచనాలకు తగ్గట్లే ఇప్పటికే రిలీజైన గామి పోస్టర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలే రిలీజైన 'గామి' ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో మామూలుగా ట్రెండ్ అవ్వలేదు. ట్రైలర్ లోని డైలాగ్స్, గ్రాఫిక్స్, విజువల్స్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేశాయి. ఎంతలా అంటే సినిమా చూడక ముందే.. విశ్వక్ కెరీర్ లో గామి 'ది బెస్ట్' మూవీ అవ్వబోతుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

publive-image

రాజమౌళి పోస్ట్

అయితే కేవలం ప్రేక్షకుల్ని మాత్రమే కాదు ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళిని కూడా ఇంప్రెస్ చేసింది 'గామి' ట్రైలర్. ట్రైలర్ ను అభినందిస్తూ జక్కన్న పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. "అసాధ్యం అనుకున్న నిజం చేయడానికి నిర్మాత కార్తిక్, విద్యాధర్ చేసిన గాడిద చాకిరీ.. వాళ్ళు నాకు అద్భుతమైన విజువల్స్ చూపించినప్పుడు తెలిసొచ్చింది. అలాంటి అద్భుతమైన విజువల్స్ సృష్టించడానికి నాలుగేళ్ళ పాటు పడిన కష్టం వాళ్ళ మాటల్లో అర్థమైంది. మార్చి 8 విడుదల కాబోతున్న 'గామి' సినిమాకు, చిత్ర యూనిట్ కు నా బెస్ట్ విషెస్ అని అంటూ పోస్ట్ పెట్టారు."

Also Read: Uday Kiran: ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్

Advertisment
తాజా కథనాలు