/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-jpg.webp)
Chandrababu Naidu Health Bulletin: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry) జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు(Chandrababu) ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు జైలు అధికారులు. నారా చంద్రబాబు నాయుడికి రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజనీ ఆస్పత్రికి చెందిన వైద్య బృందం నేతృత్వంలో వైద్య పరీక్షలు చేయించడం జరిగిందని అధికారులు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల సూచనల మేరకు అవసరమైన డైట్ ఫాలో అవుతున్నామని చెప్పారు. వైద్య సహాయం కూడా అందిస్తున్నామన్నారు. ఎలాంటి భయాందోళనలకు, అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు జైలు అధికారులు.
చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన వారిలో
1. డాక్టర్ మార్కండేయులు - అసోసియేట్ ప్రొఫెసర్(జనరల్ మెడిసిన్ విభాగం)
2. డాక్టర్ సిహెచ్.వి.వి శివకుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, (జనరల్ సర్జరీ విభాగం)
3. డాక్టర్ సిహెచ్.వి. సునీతా దేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్(డెర్మటాలజీ విభాగం)
4. డాక్టర్ శ్రీన్.వి.వి.ఎన్.యస్. మహేంద్ర, అసిస్టెంట్ ప్రొపెసర్(అనస్థీషియాలజీ విభాగం)
5. డాక్టర్ ఎస్. హిమజ. అసోసియేట్ ప్రొఫెసర్(పాథాలజీ విభాగం)
ఇదికూడా చదవండి:భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్
వీరంతా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల ప్రకారం చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ఇలా ఉంది.
1. బ్లడ్ ప్రెజర్ - 140/80mmhg
2. టెంపరేచర్ - సాధారణం
3. పల్స్ - 67/mln
4. రెస్పిరేటరీ రేట్ - 12/mln
5. spo2 - 96% on room air
6. Heart - s1 s2+
7. Lungs - Clear
8. Physical Activity - Good
9. Weight - 67 Kg
10. RBS - 117 mg/dl
ఇదికూడా చదవండి: Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..?