Andhra Pradesh: నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ వివరాలు మీకోసం..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో ఎట్టకేలకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్. చంద్రబాబు తన చర్మ సమస్యలను తెలియజేశారన్నారు జైలు వైద్యాధికారులు.

New Update
ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

Chandrababu Health Bulletin: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో ఎట్టకేలకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్. చంద్రబాబు తన చర్మ సమస్యలను తెలియజేశారన్నారు జైలు వైద్యాధికారులు. ఈ సమస్యను పరిశీలించేందుకు.. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి ఇద్దరు వైద్యులు చంద్రబాబును పరీక్షించారు. వారి సూచనల మేరకు చంద్రబాబుకు వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పస్టం చేశారు.

చంద్రబాబు హెల్త్ బులెటిన్ వివరాలు..

➤ బిపి - 140/80

➤ టెంపరేచర్ - నార్మల్

➤ పల్స్ - 87

➤ Spo2 - 97

➤ Heart - s1 s2

➤ Lungs - క్లియర్

➤ ఫిజికల్ యాక్టివిటీ - గుడ్

తమ అభ్యర్థన మేరకు ప్రభుత్వ ఆసుపత్రి నుండి చర్మవ్యాధి నిపుణులు వచ్చి చంద్రబాబును పరీక్షించారుని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు.

Also Read

స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ఇండియా,అఫ్ఘాన్‌ మ్యాచ్‌ సమయంలో ఏం జరిగిందంటే?

 శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు