Raj Tharun-Lavanya : బిగ్ ట్విస్ట్.. అతనే నా మొగుడన్న లావణ్య.. ఆధారాలు ఉన్నాయన్న రాజ్ తరుణ్! రాజ్ తరుణ్, లావణ్య మధ్య మరోసారి వార్ నెలకొంది. ప్రసాద్ ల్యాబ్ వద్ద రాజ్ తరుణ్ ను కలిసేందుకు లావణ్య రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లావణ్య ఆరోపణలు చేసింది. దీనిపై రాజ్ తరుణ్ స్పందిస్తూ తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని, న్యాయపరంగా పోరాటం చేస్తానని చెప్పారు. By Anil Kumar 31 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Raj Tarun - Lavanya Issue : రాజ్ తరుణ్ (Raj Tarun) - లావణ్య (Lavanya) ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇంకా సర్దుమణిగినట్లు లేదు. తాజాగా ఈ ఇద్దరి మధ్య మరోసారి వార్ నెలకొంది. లావణ్య రాజ్ తరుణ్ ను కలవాలంటూ ప్రసాద్ ల్యాబ్ వద్దకు వచ్చింది. రాజ్ తరుణ్ తన కొత్త సినిమా 'తిరగబడరా సామి' ప్రెస్ మీట్ కోసం వచ్చాడు. దీంతో లావణ్య అతన్ని కలిసేందుకు రాగా.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ప్రసాద్ ల్యాబ్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో.." నా రాజ్ తో మాట్లాడనివ్వండి. నా భర్తతో మాల్వీ ఎందుకు ఉంటుంది.. మొగుడితో సంసారం చేసినట్లు రాజ్ తో మాల్వీ కలిసి ఎందుకు ఉంటుంది. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు మాట్లాడనివ్వండి' అంటూ ఆరోపించింది. కాగా రాజ్ తరుణ్ ఈ వ్యవహారంలో మరోసారి స్పందించాడు. " లావణ్య వ్యవహారంలో నేను లీగల్ గానే పోరాటం చేస్తాను. నేను లావణ్య కు వ్యతిరేకంగా వెళ్లడం లేదు. నేను ఆమె ఆరోపణలు చేసే వాటికి నేను లీగల్ గా వెల్లుతున్నాను. నేను ఆల్రెడీ లీగల్ గానే ముందుకు పోతున్నాను. విషయం బయటకి రాగానే నేనే అన్ని మీడియా చానెల్స్ ముందుకు వచ్చాను. Also Read : శంకర్ గాడి మెంటల్ మాస్ కి రెడీ అయిపోండి.. ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ రిలీజ్, ఎప్పుడంటే? నేను క్లారిటీ ఇచ్చాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. లీగల్ గానే ముందుకు పోతాం. నాకు పెళ్లి అంటే చాలా భయం. జీవితం లో పెళ్లి గోల వద్దు అనుకున్నా. నాతో పాటు శేఖర్ బాషా కూడా చాలా ఆధారాలు బయట పెట్టాడు. నేను 'పురుషోత్తముడు' మూవీ ప్రమోషన్ కి రాకపోవడానికి కారణం ఉంది. నేను కూడా మనిషినే, నాపై కావాలనే నిందలు, ఆరోపణలు వచ్చాయి. దీంతో నేను రాలేక పోయాను. ఏదైనా కూడా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. నా 32 ఏళ్ల జీవితం లో వేలాది మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు.. ఎవరైనా ఒక్కరు వచ్చి నా మీద చెడుగా చెప్పమని చెప్పండి. వారం, పది రోజులుగా నేను ఇంట్లో కూర్చొని భాద పడుతున్నాను. నేను చిన్న విషయానికి కూడా చాలా భాద పడుతుంటాను. నాతో పాటు నా తల్లిదండ్రుల కూడా చాలా భాద పడుతున్నారు. నేను హైదరాబాద్ (Hyderabad) లోనే ఉన్నాను, నేను ఎక్కడ బయట పడి పారిపోలేదు. నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే నేను బయటకి రాలేదు. లావణ్య దగ్గర ఉన్న ఆధారాలు కంటే నాతో కూడా చాలా ఆధారాలు ఉన్నాయ" అని పేర్కొన్నాడు. #tollywood #actor-raj-tarun #raj-tarun-lavanya-issue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి