Telangana Rains: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు!

TG: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఖమ్మం, కరీంనగర్, భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Telangana Rains: తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, హన్మకొండ, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వాతావరణంలో మార్పులు కారణంగా ప్రజలు అనారోగ్యం భారిన పడే అవకాశం ఉందని.. ముఖ్యంగా పిల్లలు దగ్గు, జ్వరాలు వచ్చే అవకాశం ఉందని.. వారిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది.

Advertisment
తాజా కథనాలు