Rains In Telangana: తుఫాన్ ఎఫెక్ట్.. వర్షాలే... వర్షాలు..! దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉదయం నుంచి వాన కురుస్తోంది.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ విభాగం హైదరాబాద్ శాఖ అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో 'మిచాంగ్' తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. By Trinath 23 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Cyclone alert: వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హైదరాబాద్ శాఖ అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం నాడు హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. వర్షం కారణంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వర్షం కారణంగా రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలుగా ఉంది. తేమ 41 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తెలంగాణతో పాటు ఏపీలోని ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. దక్షిణ అండమాన్ సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 25న ఇది ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత నవంబర్ 26న అల్పపీడనంగా మారవచ్చు. ఆ తర్వాత నవంబర్ 27న తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా. వివిధ అంతర్జాతీయ వాతావరణ నమూనాలు ఇది తీవ్ర తుఫానుగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాయి. అందుకే టెన్షన్ పెరుగుతోంది. గ్లోబల్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ప్రకారం, ఇది నవంబర్ 28 వరకు వాయువ్యంగా కదులుతుంది. ఆ తర్వాత వాయువ్య దిశ నుంచి బంగ్లాదేశ్ తీరం వైపు నెమ్మదిగా కదులుతుంది. ఇది క్రమంగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని యూరోపియన్ సెంటర్ తెలిపింది. ఆ తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతుంది. ఈ తుపాను ఏ తీరాన్ని తాకుతుందో ఇప్పటివరకు క్లారిటీ లేదు. మిచాంగ్ గా పేరు: మియన్మార్ ప్రతిపాదించిన ఈ తుపానుకు 'మిచాంగ్' అని పేరు పెట్టనున్నారు. దీన్ని 'మిగ్జామ్'గా ఉచ్ఛరించాలి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ 'మిచాంగ్' తుపాను పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సమాచారం. ఇది ఏర్పడితే ఈ ఏడాది బంగాళాఖాతంలో నాలుగో తుపాను అవుతుంది. ఈ ఏడాది భారత జలాల్లో ఆరోది అవుతుంది. Also Read: పోటెత్తిన అభిమానులు.. విశాఖ టీ20 ఫైట్‌లో ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే? WATCH: #telangana-rains #hyderabad-rains #cyclone-alert మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి