Weather Updates: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. రానున్న 5 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. రుతుపవనాలకు తోడు ద్రోణి ఏర్పడటంతో విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది. రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్రమట్టానికి 3.1-5.8కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రానున్న 5 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ జోరు వానలు పడతాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Weather Updates: రానున్న 5 రోజులు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలకు తోడు ద్రోణి ఏర్పడటంతో విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
New Update
Advertisment