/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)
Telangana: ఈ నెల 29 నాటికి తూర్పు మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వానలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
Today Weather Updates..#weatherupdates #latestupdate #RTV pic.twitter.com/omgjpnk8Sm
— RTV (@RTVnewsnetwork) August 27, 2024
ఈ నెల 29, 30 తేదీల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35.5 డిగ్రీలు ఉండగా..కనిష్ట ఉష్ణోగ్రతలు 25. 5 డిగ్రీలుగా ఉండనుంది. కానీ నగరంలో కొన్ని ప్రాంతాల్లో అక్కడకక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతారణశాఖ అధికారులు తెలిపారు. ఏపీలోని విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37.5 డిగ్రీలుగా ఉండగా..కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలుగా ఉండనున్నట్లు అధికారులు వివరించారు.
అక్కడక్కడ జల్లులు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 34. 5 డిగ్రీలు ఉండగా...కనిష్ట ఉష్ణోగ్రతలు29.5 డిగ్రీలుగా ఉండనున్నట్లు, ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
తిరుపతిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32.5 డిగ్రీలుగా ఉండగా..కనిష్ట ఉష్ణోగ్రతలు 26.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.