Telangana Rain: ఎర్రటి ఎండల్లో చల్లటి కబురు..2 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. వచ్చే రెండ్రోజుల్లో ఎండలు తగ్గుముఖం పడతాయని, ఆకాశం మేఘావృతం అవుతుందని అధికారులు అన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

New Update
Telangana Rain: ఎర్రటి ఎండల్లో చల్లటి కబురు..2 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు

Telangana Rain: ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. వచ్చే రెండ్రోజుల్లో ఎండలు తగ్గుముఖం పడతాయని, ఆకాశం మేఘావృతం అవుతుందని అధికారులు అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు నిజామాబాద్‌ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఖమ్మం, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మాత్రం వడగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు.

publive-image

ఈ జిల్లాల ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ జిల్లాలే కాకుండా కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లిలో ఎల్లుండి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ కూడా జారి చేసింది. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంటున్నారు. హైదరాబాద్‌ వాళ్లకు మాత్రం నిరాశే అంటున్నారు. నగరంలో వర్షాలు పడే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అకాల వర్షాలతో పంటలు ఎక్కడ దెబ్బతింటాయోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

డీహైడ్రేషన్ కేసులు:

రెండు రోజుల పాటు రాష్ట్రంలో వడగాల్పులు ఉంటాయని, ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్‌ ఉందని వాతావరణశాఖ చెబుతోంది. తెలంగాణలో గరిష్ఠంగా 43 డిగ్రీలు నమోదవుతోంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 వరకు ప్రజలు బయటికి రావొద్దని అంటున్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు ఏడీడీ బారినపడుతున్నారు. డీహైడ్రేషన్ కేసులు బాగా పెరుగుతున్నాయి. పిల్లల్లో వాంతులు, విరేచనాలు ఉంటే కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ ఇస్తుండాలని అధికారులు సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: గజ్జి, తామరను మూడు రోజుల్లో మాయం చేసే చిట్కాలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు