Rains: ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. 72 గంటల పాటు ఏకధాటిగా...! ఉత్తరాఖండ్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 72 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నదులు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కీలక హైవేలపై రాకపోకలు నిలిపివేశారు. పలు రైల్వే స్టేషన్లు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. By Jyoshna Sappogula 09 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Uttarakhand Rains: దేశంలో పలుచోట్ల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని నగరాలు వరదలతో నిండి ఉన్నాయి. ఢిల్లీ, ముంబై ఉత్తరాఖండ్‌లోనూ వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉత్తరాఖండ్‌లో 72 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నదులు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. Also Read: కథువా ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం : భారత్ కీలక హైవేలపై రాకపోకలు నిలిపివేశారు. పలు రైల్వే స్టేషన్లు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వర్షం కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు. పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఇరుక్కుపోయారు. ముంబైలో మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. తీరంలో హై టైడ్ అలర్ట్ జారీ చేశారు. అటు విద్యాసంస్థలు కూడా ఇవాళ బంద్ చేశారు. అంతేకాకుండా కొన్ని చోట్ల లోకల్ ట్రెయిన్స్ బంద్ అయ్యాయి. నిన్న ఆరు గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇవాళ ఉదయం కాసేపు విరామం ఇచ్చిన వరుణుడు.. మళ్లీ మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిపిస్తున్నాడు. అటు ఢిల్లీలోనూ కుండపోతగా వర్షం పడుతోంది. #rains #latest-news-in-telugu #uttarakhand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి