తెలంగాణకు రాహుల్ గాంధీ.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా! జోరుగా కాంగ్రెస్ ప్రచారం

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ 17న తెలంగాణలో పర్యటించనున్నారు. గాంధీభవన్, హైదరాబాద్ సమావేశాల్లో ఖర్గే దిశానిర్దేశం చేయనుండగా; రాహుల్ గాంధీ ఐదు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు.

తెలంగాణకు రాహుల్ గాంధీ.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా! జోరుగా కాంగ్రెస్ ప్రచారం
New Update

Telangana Elections 2023: తెలంగాణలో ఈనెల 17న ఒకే రోజు ఐదు నియోజకవర్గాల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సుడిగాలి పర్యటన చేయనున్నారు. కార్నర్ మీటింగులు, రోడ్ షోలు, పాదయాత్రలతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన బిజీ బిజీగా సాగనుంది. కాంగ్రెస్‌ ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్న ప్రాంతాలలో ఆయన పర్యటించబోతున్నారు. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు.
వారి పర్యటన వివరాలిలా ఉన్నాయి:
శంషాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11 గంటలకు పినపాకకు చేరుకుని మధ్యాహ్నం 12గంటల వరకు అక్కడ రోడ్ షో, కార్నర్ మీటింగులో పాల్గొంటారు. పినపాక నుంచి నర్సంపేటకు వెళ్లి అక్కడ రెండు మూడు గంటలు సమావేశాల అనంతరం రోడ్డు మార్గంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటిస్తారు. అక్కడ సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర నిర్వహించి అనంతరం వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి చేరుకుంటారు. సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ రాజేంద్రనగర్ వచ్చి సమావేశం అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
మరోవైపు ఖర్గే ఉదయం 11గంటలకు గాంధీభవన్‌కు చేరుకుని అక్కడ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఖర్గే రాత్రి హైదరాబాదులోనే ఉంటారు.

#rahul-gandhi #telangana-elections-2023 #aicc-president-mallikarjun-kharge
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe