Rahul Gandhi: ఈరోజు CWC సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలందరూ రాహుల్ గాంధీనికి ప్రతిపక్ష ఎన్నుకున్నామని అన్నారు. భారత ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించే సత్తా రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఎంపీ గా పోటీ చేశారు రాహుల్ గాంధీ. ఈ రెండు స్థానాల్లో కూడా భారీ విజయం సాధించారు. ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తమ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని కూటమి నేతలు మీడియాకు పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 99 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అలాగే బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర ప్రదేశ్ లో కూడా కాషాయ జెండాను దించి అక్కడ మెజారిటీ స్థానాల్లో మూడు రంగుల జెండా ఎగరేసింది కాంగ్రెస్.