Telangana election2023 : మీకు నేనున్నా..చంద్రయ్య కుటుంబానికి రాహుల్ భరోసా..!!

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించారు. మీకు నేనున్నా అంటూ చంద్రయ్య కుటుంబానికి రాహుల్ భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కల్వకుర్తి మండలంలో పర్యటించారు.

New Update
Telangana election2023 : మీకు నేనున్నా..చంద్రయ్య కుటుంబానికి రాహుల్ భరోసా..!!

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. కల్వకుర్తి మండలంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని రాహుల్ పరామర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రయ్య ఇంటికి వెళ్లిన రాహుల్..మీకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. జిల్లెల్ల గ్రామంలో నాలుగేళ్ల క్రితం రూ. 8 లక్షల అప్పు తీర్చలేక పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుమ్మరి చంద్రయ్య నివాసానికి వెళ్లారు. బాధిత కుటుంబాన్ని రాహుల్ పరామర్శించారు.

ఇది కూడా చదవండి: ప్రభాకర్ రెడ్డిని పొడిచింది అందుకే.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో రఘునందన్ షాకింగ్ నిజాలు..!!

చంద్రయ్య భార్య తిరుపతమ్మ, కొడుకు, కూతురుతో మాట్లాడిన రాహుల్ వారిని ఓదార్చారు. వారికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ వెంట మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క, కసిరెడ్డి నారాయణతోపాటు తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు