Rahul Gandhi: రాహుల్ పెళ్లి చేసుకోబోయేది ఆమెనేనా? కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ త్వరలోనే షోలాపూర్ లోక్ సభ సభ్యురాలు ప్రణీతి షిండే ను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సునీల్ కుమార్ కూతురే ప్రణీతి షిండే. By Bhavana 09 Sep 2024 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Rahul Gandhi: భారతదేశంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో కాంగ్రెస్ లోక్ సభ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఒకరు. గత కొంత కాలంగా ఆయన పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఎన్నికల సమయంలో కూడా రాయబరేలిలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. అప్పుడు కూడా వివాహం ఎప్పుడు చేసుకుంటారని అడిగిన కూడా రాహుల్ గాంధీ ఈ విషయాన్ని నవ్వుతూ తప్పిస్తున్నారే తప్ప సమాధానం మాత్రం చెప్పడం లేదు. దీంతో చాలామంది నేతలు అసలు రాహుల్ గాంధీ చేసుకుంటారా లేదా అనే సందేహం కూడా వెల్లిబుచ్చారు. రాహుల్ గాంధీ వయసు ప్రస్తుతం 54 ఏళ్లు.. ప్రియాంక గాంధీ పెళ్లికూతురుని వెతికే పనిలో పడ్డట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా సాగుతుండగా.... పెళ్లి కూతురు దొరికిందని ఆమె వయసు 42 ఏళ్ళని ఆమె మరెవరో కాదు ప్రణితి షిండే అన్నట్లుగా వార్తలు ఒక్కసారిగా తెరమీదరకు వచ్చాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సునీల్ కుమార్ కూతురే ప్రణీతి షిండే.. ఈమె షోలాపూర్ లోక్ సభ సభ్యురాలు . అయితే వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతుండడంతో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ పెళ్లి గురించి అటు రాహుల్ గాంధీ కానీ ప్రణతి షిండే కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. సోషల్ మీడియాలో మాత్రం పలు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అటు రాహుల్ గాంధీ, ప్రణతి షిండే వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో జోడో యాత్రలో ప్రణతి చెయ్యి పట్టుకొని మరి రాహుల్ తో కలిసి నడిచినట్లుగా కొన్ని వీడియోలు ఫోటోలు వైరల్ కావడంతో అప్పటినుంచి ఊహాగానాలు ఎక్కువయ్యాయి. Also Read: పట్టాలపై గ్యాస్ సిలిండర్…తప్పిన పెను ప్రమాదం! #rahul-gandhi #marrige #pranithi-shinde మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి