Telangana News: బీజేపీపై పోరాడితే నాపై కేసులు...ఇల్లు లాక్కున్నారు: రాహుల్ గాంధీ

పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీపై పోరాడితే తనపై కేసులు పెట్టి లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ఆరోపించారు.

New Update
Telangana News: బీజేపీపై పోరాడితే నాపై కేసులు...ఇల్లు లాక్కున్నారు: రాహుల్ గాంధీ

పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీపై పోరాడితే తనపై కేసులు పెట్టి లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ఆరోపించారు. రువారం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీజేపీపై పోరాడితే తనపై అనేక కేసులు పెట్టి లోక్‌సభలో అడుగుపెట్టకుండా సభ్యత్వం రద్దు చేసి ఢిల్లీలోని తన ఇల్లును లాక్కున్నారన్నారు. ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయలు తన మిత్రులకు కట్టబెడుతున్నారని, నిరుపేదలకు చేసింది ఏమీ లేదన్నారు. నిరుపేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామని నమ్మబలికి మోసగించారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని ఎక్కడ భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందో అక్కడ కేసీఆర్ ఎంఐఎంతో పోటీ చేయించి బీజేపీకి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. బీజేపీకి బీటీంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందన్నారు.

ప్రతి ఒక్కరికి ఇల్లు సౌకర్యం

దేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిలో నెంబర్ వన్‌గా ఉన్నారన్నారు. లోపాయికారి ఒప్పందం వల్లే సీఎం అవినీతిపై కేంద్రం మౌనం వహిస్తుందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి అందిస్తామని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలోని దళితులను మోసగించారని డబుల్ బెడ్ రూములు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గూడు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు సౌకర్యం కల్పిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టిన తొలి రోజున ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందించడం తోపాటు ప్రతి మహిళ ఖాతాలో రూ.2500 ప్రతినెలా వేస్తామన్నారు.

కర్ణాటకలో ప్రతి హామీ అమలు చేస్తోంది

కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తెలంగాణకు వస్తే తనకు ఎంతో ఆనందం కలుగుతుందని, రాజకీయ సంబంధం కంటే కుటుంబ సంబంధం ఉందనిపిస్తోందన్నారు. సభలో పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు, సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్‌సింగ్, విజయ రమణారావు, సీతక్క, మధుయాష్కి తో పాటు పలువురు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: డ్రీమ్ 11లో కోటిన్నర గెలుచుకున్న సీఐ… షాక్ ఇచ్చిన అధికారులు

Advertisment
Advertisment
తాజా కథనాలు