Rahul Gandhi: ఓ వైపు గాంధీ..మరో వైపు గాడ్సే..ఇది ఇద్దరి మధ్య పోరాటం: రాహుల్‌!

దేశంలో ఆర్ఎస్‌ఎస్(RSS), బీజేపీ(BJP) సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ (Congress)పోరాటం జరుపుతోందని మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దేశంలోనే అవినీతికి కేంద్ర స్థానంగా మధ్య ప్రదేశ్‌ నిలిచిందని చెప్పారు.

Rahul Gandhi: ఉపాధి హమీ కూలీలు, కౌలు రైతులకు రాహుల్ ఆఫర్..
New Update

దేశంలో ఆర్ఎస్‌ఎస్(RSS), బీజేపీ(BJP) సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ (Congress)పోరాటం జరుపుతోందని మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దేశంలోనే అవినీతికి కేంద్ర స్థానంగా మధ్య ప్రదేశ్‌ నిలిచిందని చెప్పారు. శనివారం ఆయన భోపాల్‌ లో జరిగిన జన్‌ ఆక్రోష్‌ యాత్రలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.

ఇది కాంగ్రెస్‌, ఆర్ఎస్‌ఎస్‌-బీజేపీ మధ్య సిద్దాంతాల పోరని చెప్పారు. ఒక పక్కన గాంధీ..మరో పక్క గాడ్సే ఉన్నారని ఆయన బీజేపీ పై పరోక్ష విమర్శలు చేశారు. దేశంలో ఒక వైపు విద్వేషం, హింస ఉన్నాయి. మరో వైపు ప్రేమ, గౌరవం, సౌభ్రాతృత్వం ఉన్నాయి. బీజేపీ వారు ఎక్కడికి వెళ్లినా విద్వేష వ్యాప్తిని చేస్తుంటారు.

కానీ ఈరోజు వాళ్లను మధ్య ప్రదేశ్ లోని యువత, రైతులు ద్వేషించడం మొదలైంది అంటూ రాహుల్‌ చెప్పుకొచ్చారు. మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలో 18 ఏళ్ల బీజేపీ ప్రభుత్వ హయాంలో సుమారు 18 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. పంటలకు సరైన ధరను మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం ఇవ్వడం లేదని, ఛత్తీస్‌ గఢ్‌ వెళ్లి వరి పంటకు అక్కడి ప్రభుత్వం ఎంత ఇస్తోందో అడిగి తెలుసుకోవాలని అన్నారు.

దేశ చరిత్రలో రైతులు తొలిసారిగా పన్నులు కడుతున్నారని, బీజేపీ జీఎస్టీ ని అమలు చేస్తున్నారని..కానీ కాంగ్రెస్ మాత్రం పేదలు, రైతుల కోసం పని చేస్తోందని వివరించారు. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. చాలా రోజులుగా కాంగ్రెస్ ఈ డిమాండ్‌ని వినిపిస్తోంది.

మహిళా రిజర్వేషన్ బిల్‌ కు ముందుగానే కుల గణన చేపట్టి వెనక బడిన వర్గాలకు చెందిన మహిళలకు చేయూతనివ్వాలని తేల్చి చెబుతోంది.

#congress #bjp #rss #rahul
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe