Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షనేతగా ఉండాలని రాహుల్‌ను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మొన్నటిదాకా ప్రతిపక్షనేతగా అధిర్ రంజన్‌చౌదరి ఉన్న విషయం తెలిసిందే. కాగా లోక్ సభ ఎన్నికల్లో అధిర్ రంజన్ చౌదరి ఓటమి చెందడంతో తెరపైకి రాహుల్ పేరు వచ్చింది. ప్రతిపక్షనేతగా ఉంటే రాహుల్ ఇమేజ్ మరింత పెరుగుతుందనే యోచనలో కాంగ్రెస్ ఉంది.
మరి దీనిపై రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 99 సీట్లతో రెండో పెద్దపార్టీగా అవతరించి ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ పార్టీ సాధించింది. లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాలు వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి బంపర్ మెజారిటీతో రాహుల్ గెలిచిన విషయం తెలిసిందే. భారత్‌జోడో యాత్ర తర్వాత దేశంలో రాహుల్ ఇమేజ్ భారీగా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.