Rahul gandhi: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం: రాహుల్ గాంధీ

సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక గిరిజనులకు తమ భూములపై హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా చేస్తామని ప్రకటించారు.

Rahul Gandhi: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ శాలరీ.. ఆయనకు ఉండే పవర్స్ ఏంటో తెలుసా?
New Update

రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దొరలు, తెలంగాణ ప్రజల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. ములుగులో నిర్వహించిన విజయభేరీ సభలో ఆయన ప్రసంగంచారు. కాంగ్రెస్ పార్టీ 2004లోనే తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని.. ఆ హామినీ ఎలా నెరవేర్చామో ప్రపంచం చూసిందని అన్నారు. నష్టాలు కలిగించే నిర్ణయాలు పార్టీలు తీసుకోవని.. కానీ తమకు నష్టం కలుగుతుందని తెలిసినా కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని తెలిపారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. గతంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నామని.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. అలాగే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారని.. ఎంతమందికి వీటిని అమలు చేశారని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లాంటి కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో అందరికీ రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం ఇస్తామని చెప్పి అమలు చేస్తున్నామని అన్నారు.
ఇది కూడా చదవండి: Priyanka gandhi: బీఆర్ఎస్ నేతలు వందల కోట్లు దోచుకున్నారు: ప్రియాంక గాంధీ

ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యం క్వింటాల్‌ రూ.2,500కు కొంటున్నామని.. ఇప్పుడు దేశంలో వరిధాన్యం కొనుగోలు ధర ఛత్తీస్‌గఢ్‌లోనే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని.. ప్రతి నెలా మహిళలకు వారి అకౌంట్‌లోకి ఉచితంగా డబ్బు పడుతోందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని.. తెలంగాణలో కూడా తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు తమ భూములపై హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అవి పోడు భూములైనా, అసైన్డ్ భూములైనా మీ భూమి మీకిస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా చేస్తామని ప్రకటించారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసి పనిచేస్తున్నాయని.. వాటికి తోడు ఎంఐఎం పార్టీ కూడా కలిసి పోయిందని అన్నారు. పార్లమెంటులో బీజేపీకి అన్ని విధాలుగా బీఆర్ఎస్ మద్దతు తెలుపుతోందని అన్నారు. నన్ను కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా వేధించిందని.. కానీ కేసీఆర్‌పై మాత్రం ఒక్క సీబీఐ, ఈడీ, ఐటీ కేసు కూడా లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మిలాఖత్ అయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పార్టీని ఓడించామని.. ఇప్పుడు జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక్లలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

#rahul-gandhi #telangana-elections-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe