టీకాంగ్రెస్‌ నేతలతో బిజీబిజీగా రాహుల్‌గాంధీ

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ గాంధీ వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు కూడా పలువురు నేతలు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నారు.

New Update
టీకాంగ్రెస్‌ నేతలతో బిజీబిజీగా రాహుల్‌గాంధీ

Rahul Gandhi busy with Tea Congress leaders

తెలంగాణే టార్గెట్..

వరుసగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ అవుతున్నారు. నేడు కూడా టీకాంగ్రెస్ నేతలతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ విషయాలపై రాహుల్, ఖర్గే, కేసీవేణుగోపాల్ ఏఐసీసీ వార్ రూమ్‌లో టీకాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ నిర్వహించనున్నారు.ఈ సమావేశానికి 21 మంది తెలంగాణ నేతలకు పిలుపు ఇచ్చింది కాంగ్రెస్‌ అధిష్టానం. రేవంత్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్, మధు యాష్కీ, వీహెచ్ జగ్గారెడ్డి, సీతక్క, జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు తదితర నేతలతో ఢిల్లీ పెద్దలు చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీకాంగ్రెస్ స్ట్రాటజీపై.. పార్టీలో అంతర్గత కలహాలపై, కోవర్టుల ఆరోపణలపై నేతలు ప్రత్యేకంగా చర్చించనున్నారు.
ఘర్ వాపసీ, అపరేశన్ ఆకర్ష్, చేరికల అంశం, కేసీఆర్ హటావో తెలంగాణ బచావో నినాదాన్ని ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై చర్చించనున్నారు. దీంతోపాటు రాహుల్, ప్రియాంక ,ఖర్గే రాష్ట్ర పర్యటనల షెడ్యూల్ ఖరారును నేతలు చేయనున్నారు.

మళ్లీ రండి సొంతగూటికి

నిన్న కూడా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌కు చెందిన దాదాపు 35 మంది నేతలు రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెళ్లిపోయిన పలువురు నేతలు తిరిగి సొంతగూటికి చేరుతుండటం ఆనందంగా ఉందని రాహుల్‌ అన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఘర్‌ వాపసీ కార్యక్రమం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వమే లక్ష్యం..

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, అందుకు పార్టీ నేతలంతా సమష్ఠిగా పోరాడాలని రాహుల్‌ దిశా నిర్దేశం చేసినట్లు నేతలు పేర్కొన్నారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో నినాదంలో ముందుకెళ్లాలని రాహుల్‌ కోరారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కేసీ వేణుగోపాల్‌, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీతోపాటు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, గురునాథరెడ్డి తదితరులు ఉన్నారు.

బహిరంగ సభలో.. కాంగ్రెస్ కండువాలు..!

మరోవైపు ఇటీవల బీఆర్ఎస్‌ నుంచి బయటికొచ్చిన జూపల్లి, పొంగులేటితోపాటు మరికొందరు నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, పార్టీ కండువాలు కప్పుకోవాలని తామంతా భావిస్తున్నామని, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాల్సిందిగా రాహుల్‌, మల్లికార్జున ఖర్గేలను వారు ఆహ్వానించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు