Rahul Gandhi: రాహుల్ గాంధీ డూప్ వివరాలను త్వరలోనే బయటపెడతాను: అస్సాం సీఎం! అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సమయంలో రాహుల్ తన డూప్ ని ఉపయోగించారంటూ అస్సా ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఆరోపించారు. ఆ డూప్ వివరాలను, చిరునామాను త్వరలోనే అందరితో పంచుకుంటానని ఆయన వివరించారు. By Bhavana 28 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rahul Gandhi: అస్సాం ముఖ్యమంత్రి(Assam CM) హిమంత బిశ్వ శర్మ (Himantha Biswasarma) రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో భారత్ జోడో న్యాయ్ (Bharat Jodo Nyay Yatra) యాత్ర సమయంలో రాహుల్ తన డూప్ ని ఉపయోగించారంటూ ఆరోపించారు. ఆ డూప్ వివరాలను, చిరునామాను త్వరలోనే అందరితో పంచుకుంటానని ఆయన వివరించారు. యాత్ర సమయంలో బస్సులో కూర్చొని ఉన్న రాహుల్ లాంటి ఓ వ్యక్తిని కాంగ్రెస్ రంగంలోకి దింపిందని ఆయన అన్నారు. కొన్ని రోజులు వేచి ఉండండి..ఆ డూప్ పేరు, అతని చిరునామా అన్ని వివరాలను వెల్లడిస్తాను అంటూ తెలిపారు. దీని గురించి విలేకర్లు ప్రశ్నించగా దానికి సీఎం "నేను రేపు (ఆదివారం) దిబ్రూఘర్‌లో ఉంటాను, మరుసటి రోజు కూడా నేను గౌహతి నుండి బయటకు వస్తాను. నేను గౌహతికి తిరిగి వచ్చిన తర్వాత, డూప్లికేట్ పేరు, చిరునామాను మీ అందరికీ తెలియజేస్తాను" అని చెప్పాడు. గాంధీ నేతృత్వంలోని మణిపూర్-మహారాష్ట్ర న్యాయ్ యాత్ర జనవరి 18 నుండి 25 వరకు అస్సాం గుండా ప్రయాణించింది, ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అస్సాం ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ "భారతదేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి" అని ఆరోపించారు. యాత్రకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు ఏర్పరస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. గువాహటిలో యాత్ర సమయంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో రాహుల్ తో పాటు మరికొందరు నేతల పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ ఎన్నికల తరువాత అరెస్ట్ అవుతారని సీఎం ముందు నుంచి అంటునే ఉన్నారు. Also read: రాజకీయాలకు గల్లా గుడ్ బై! #rahul-gandhi #bharat-jodo-nyay-yatra #asaam-cm #himanth-biswakarma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి