Rahul Gandhi Flying Kiss In Lok Sabha : రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ (Smriti Irani) సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రసంగం ముగించుకుని వెళ్తూ సభకు రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిసెస్ ఇచ్చారని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రవర్తన అత్యంత అమర్యాదకరంగా వుందని ఆమె ఫైర్ అయ్యారు. మహిళా ఎంపీలు వుండే సభలో రాహుల్ గాంధీ అసభ్యకరంగా ప్రవర్తించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో వివాదంలో రాహుల్ గాంధీ:
రాహుల్ గాంధీని మరో వివాదం చుట్టు ముట్టింది. తాజాగా బుధవారం ఆయన లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడారు. ప్రసంగం అనంతరం లోక్ సభ నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన చేతిలోకి కొన్ని ఫైల్స్ పడిపోయాయి. దీంతో రాహుల్ గాంధీని చూస్తూ బీజేపీ ఎంపీలు నవ్వులు చిందించారు. దానికి కౌంటర్ గా రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలకు ఫ్లైయింగ్ కిసెస్ (Rahul Gandhi Flying Kiss) ఇచ్చి వెళ్లి పోయారని బీజేపీ ఆరోపిస్తోంది.
స్త్రీ పట్ల ద్వేషం గల వారే అలా చేస్తారు.... స్మృతి ఇరానీ - Smriti Irani calls Rahul Gandhi ‘misogynist’
అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఓ విషయానికి అభ్యంతరం తెలియజేయదలుచుకున్నాను. నా కన్న ముందు మాట్లాడిన వ్యక్తి కొంచెం అమర్యాదకరంగా ప్రవర్తించారు. మహిళా ఎంపీలు కూర్చుని వుండే పార్లమెంట్ కు కేవలం స్త్రీ ద్వేషం కల వారు మాత్రమే ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తారు. గతంలో పార్లమెంట్ లో ఎవరూ ఇలా అమర్యాదకరంగా ప్రవర్తించలేదన్నారు.
బీజేపీ నేతల ఫైర్....!
రాహుల్ గాంధీ ప్రవర్తనపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రవర్తన అసభ్యకరంగా వుందన్నారు. గతంలో కన్ను కొట్టాడు... ఇప్పుడు ఫ్లైయింగ్ కిసెస్ ఇచ్చాడని ఫైర్ అయ్యారు. ఇాది చిచోరా ప్రవర్తన కాదా? అంటూ నిలదీశారు. రాహుల్ గాంధీ తీరును ఖండిస్తున్నామంటూ ఆమె ట్వీట్ చేశారు.