Union Minister Giriraj Singh: రాహుల్, సోనియా గాంధీ దేశాన్ని విడిచిపోతారు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల తరువాత సోనియా గాంధీ, రాహుల్ దేశాన్ని విడిచిపెట్టిపోతారని అన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 ఎంపీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. మోదీ ప్రధాని అవుతారన్నారు.

New Update
Union Minister Giriraj Singh: రాహుల్, సోనియా గాంధీ దేశాన్ని విడిచిపోతారు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Union Minister Giriraj Singh: కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. భారత దేశ మొదటి ప్రధానమంత్రి నెహ్రు అధికారంలో ఉన్నప్పుడు హిందువులకు ద్రోహం చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో హిందువుల అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 10 ఏళ్లలో భారత దేశాన్ని ప్రపంచ స్థాయిలో మొదటి పది స్థానాల్లో ఉంచామని అన్నారు. భారత్ ను అభివృద్ధి దిశగా ప్రధాని మోదీ తీసుకెళ్లారని పేర్కొన్నారు.

జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో 400కు పైగా బీజేపీకి ఎంపీ సీట్లు వస్తే కాశీ, మధుర, అయోధ్య వంటి అభివృద్ధిని అన్ని రాష్ట్రాల్లో చేస్తామని అన్నారు. భారత్ దేశాన్ని అభివృద్ధి చేయాలంటే కేవలం బీజేపీ తోనే సాయమవుతుందని అన్నారు. ప్రజలు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దేశం విడిచి వెళ్లబోతున్నారు అని జోస్యం చెప్పారు.

భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం, ప్రజల, ముస్లింల ఆస్తులను లాక్కోవడం అనేవి వాళ్ళ ఆలోచనలు అని అన్నారు. ఈ తల్లి (సోనియా గాంధీ), కొడుకు (రాహుల్ గాంధీ) లకు దేశంపై ప్రేమ లేదని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా రావని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కేవలం ముస్లిం ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తుందని.. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ విరుద్ధం అని అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని.. మోదీ ప్రధాని అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు