Dravid: ద్రావిడ్ సర్‌ప్రైజ్‌కు కన్నీళ్లు పెట్టుకున్న గంభీర్.. వీడియో వైరల్! శ్రీలంక టూర్‌లో నేటినుంచి కోచ్‌గా జర్నీ మొదలుపెట్టనున్న గౌతమ్ గంభీర్‌కు మాజీ కోచ్ ద్రావిడ్ సర్‌ప్రైజ్ మెసేజ్ ఇచ్చాడు. 'నీవు ఒంటరి కాదు. మేమంతా నీతోనే ఉంటాం. అప్పుడప్పుడు నవ్వుతూ కనిపించు' అంటూ వాయిస్ మెసేజ్ పంపాడు. అది విన్న గంభీర్ ఎమోషనల్ అయ్యాడు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 27 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Dravid-Gambhir: భారత క్రికెట్ మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుంది. ఈ రోజు శ్రీలంక టూర్ తో గంభీర్ ప్రయాణం మొదలవనుండగా.. అతనికి ద్రావిడ్ సర్‌ప్రైజ్ మెసేజ్ ఇచ్చాడు. గంభీర్ కోచ్ పదవికి అతడిని సాదరంగా స్వాగతిస్తూ వాయిస్ మెసేజ్ పంపించాడు ద్రావిడ్. అది విన్న గంభీర్ కన్నీరు పెట్టుకోగా ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) ఈ మేరకు ఆ మెసేజ్ లో ఏముందంటే.. హలో గౌతమ్.. ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహవంతమైన ఉద్యోగం.. భారత్ క్రికెట్ జట్టు కోచ్‌గా లోకి నిన్ను స్వాగతిస్తున్నా. టీమ్ ఇండియాతో నా ప్రయాణం ముగిసి మూడు వారాలు గడుస్తోంది. నేను కన్న కలలకు మించి ఎంతో గొప్పగా బార్బడోస్‌లో నా పదవీకాలాన్ని ముగించా. ఆ తర్వాత ముంబై లో ప్రపంచకప్ విజేతలకు ఘన స్వాగత కార్యక్రమం ఎన్నటికీ మర్చిపోలేను. టీమ్ తో నా స్నేహాం, జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుంటా. నీవు కూడా ఇలాంటి అద్భుత విజయాలు, కాలాన్ని ఆస్వాదించాలని కోరుతున్నా' అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు ద్రావిడ్. ఇది కూడా చదవండి: Fake Police : కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్! ఇక ఫిట్‌గా ఉండే ఆటగాళ్లు నీకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నా. అదృష్టం ఎల్లప్పుడూ నీవైపే ఉండాలని కోరుకుంటున్నా. తోటి ఆటగాడిగా మైదానంలో నువ్వు ఎంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చావో తెలుసు. బ్యాటింగ్ భాగస్వామిగా, సహచర ఫీల్డర్‌గా.. ఓటమిని అంగీకరించని నీ దృఢత్వాన్ని చూశా. ఐపీఎల్ సీజన్లలో నీ కోచింగ్‌తో.. గెలవాలనే నీ కసిని, యువ ఆటగాళ్లతో కలిసి పని చేసే విధానాన్ని, మైదానంలో నీ జట్ట నుంచి ఉత్తమ ప్రదర్శనను బయటకు తీసే సామర్థ్యాన్ని గుర్తించా. భారత క్రికెట్‌పై నీ అంకితభావం నాకు తెలుసు. కోచ్‌గా వీటన్నింటిని నువ్వు అత్యుత్తమంగా ప్రదర్శించాలని ఆకాంక్షిస్తున్నా. మనపై అంచనాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ఒంటరివాడివి కాదు. ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది, మేనేజ్‌మెంట్ నుంచి ఎల్లప్పుడూ నీకు మద్దతుగా నిలుస్తుంది. నీకు కష్టమైనా సరే.. అప్పుడప్పుడు చిరునవ్వుతో కనిపించు అని సూచించాడు. అయితే ద్రావిడ్ మాటలు విన్న గంభీర్ ఎమెషనల్ అయ్యాడు. ఎలా స్పందించాలో తెలియడం లేదన్నాడు. ద్రావిడ్ నాపై ఉంచిన బాధ్యతను నిజాయతీగా నిర్వర్తించి ద్రవిడ్ గర్వపడేలా పదవిని చేపడతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. #rahul-dravid #gautam-gambhir #inidan-cricket మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి