BCCI Prize Money: నువ్వు గొప్పోడివి సామీ.. రాహుల్ ద్రావిడ్ ఆ నిర్ణయంపై ప్రశంసల వర్షం!

టీ20 ప్రపంచ కప్ గెలిచినందుకు బీసీసీఐ టీమిండియాకు 125 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. దీనిని టీమ్ సభ్యులు, కోచింగ్ సిబ్బంది అందరూ పంచుకోవాలి. అయితే, ప్రస్తుత టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ తన ప్రైజ్ మనీలో సగం అంటే 2.5 కోట్లు మాత్రమే తీసుకుంటానని ప్రకటించారు. 

New Update
BCCI Prize Money: నువ్వు గొప్పోడివి సామీ.. రాహుల్ ద్రావిడ్ ఆ నిర్ణయంపై ప్రశంసల వర్షం!

టీ20 ప్రపంచకప్ 2024లో చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత భారత క్రికెట్ బోర్డు టీమ్ ఇండియాకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఈ ప్రైజ్ మనీని ఆటగాళ్లు, 42 మంది కోచింగ్ సిబ్బంది షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. జాతీయ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, జట్టులోని మొత్తం 15 మంది ఆటగాళ్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు లభిస్తాయి. అదే సమయంలో, మిగిలిన కోచింగ్ సిబ్బందికి రూ.2.5-2.5 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో రాహుల్ ద్రవిడ్ తీసుకున్న పెద్ద నిర్ణయం ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంది.

హృదయాలను గెలిచిన రాహుల్ ద్రవిడ్ నిర్ణయం..
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి అందుతున్న ప్రైజ్ మనీలో సగం మొత్తాన్ని వదులుకోవాలని రాహుల్ ద్రవిడ్ నిర్ణయించుకున్నాడు. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, ద్రవిడ్ తన మిగిలిన కోచింగ్ సిబ్బందికి ఇచ్చే ప్రైజ్ మనీని మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.  దాని కారణంగా అతను రూ. 5 కోట్లలో సగం అంటే రూ. 2.5 కోట్లను వదులుకోనున్నాడు. మిగిలిన కోచింగ్‌ సిబ్బంది మాదిరిగానే ఇప్పుడు ద్రావిడ్ రూ.2.5 కోట్లు మాత్రమే తీసుకోనున్నాడు.

2018లో కూడా ఇదే నిర్ణయం..
2018లో అండర్‌-19 ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుంది. ఆటగాళ్లకు రూ.30-30 లక్షలు, ద్రవిడ్‌కు రూ.50 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.20-20 లక్షలు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ద్రవిడ్ 50 లక్షలు తీసుకోవడానికి నిరాకరించాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ సహా సహాయక సిబ్బందికి బీసీసీఐ ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇచ్చింది.

టీమ్ ఇండియాతో ద్రవిడ్ ప్రయాణం ఇలా..
రాహుల్ ద్రవిడ్ 2021లో టీమిండియా కోచ్‌గా నియమితులయ్యారు. ద్రవిడ్ అప్పటి వరకు జాతీయ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌గా ఉన్నారు. అండర్-19 జట్టుకు కోచ్‌గా ఉండేవారు. రాహుల్ ద్రవిడ్ హయాంలో టీమ్ ఇండియా ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. టీం ఇండియా మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ స్థానంలో కొనసాగింది.  ODI ప్రపంచ కప్, టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇటీవల T20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ICC ట్రోఫీ దాహాన్ని కూడా తీర్చింది. 

రూ. 125 కోట్లు బహుమతి మొత్తం పంపిణీ ఇలా..

  • టీమ్ ఇండియాలో కనిపించిన 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 5 కోట్లు.
  • టీమిండియా రిజర్వ్‌ ప్లేయర్‌లుగా ఉన్న రింకూ సింగ్‌, శుభ్‌మన్‌ గిల్‌, అవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌ అహ్మద్‌లకు కోటి రూపాయల చొప్పున లభించాయి.
  • భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు 5 కోట్లు. (ఇప్పుడు రూ. 2.5 కోట్లు చేయాలని ద్రవిడ్ అభ్యర్థన).
  • టీం ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌కు ఒక్కొక్కరికి 2.5 కోట్లు.
  • టీమ్ ఇండియా ఫిజియోథెరపిస్టులు కమలేష్ జైన్, యోగేష్ పర్మార్, తులసీ రామ్ యువరాజ్‌లకు ఒక్కొక్కరికి 2 కోట్లు.
  • భారత త్రోడౌన్ స్పెషలిస్టులు రాఘవేంద్ర దివిగి, నువాన్ ఉడెనేకే ,దయానంద్ గరానీలకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు చెల్లించారు.
  • టీమ్ ఇండియా మసాజ్ థెరపిస్టులు రాజీవ్ కుమార్, అరుణ్ కనడేలకు ఒక్కొక్కరికి 2 కోట్లు.
  • భారత జట్టు కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌కు 2 కోట్లు.
  • బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు.
Advertisment
Advertisment
తాజా కథనాలు