AP politics:జగన్ కేసుల్లో జాప్యం అంటూ ఆర్ఆర్ఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్-ఎల్లుండి విచారణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపించాలని పట్టుబట్టారు రఘురామ కృష్ణంరాజు . జగన్ కేసుల విచారణలో తీవ్రజాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.

New Update
AP politics:జగన్ కేసుల్లో జాప్యం అంటూ ఆర్ఆర్ఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్-ఎల్లుండి విచారణ

హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు జగన్‌ మీద కేసులను 3071 సార్లు వాయిదా వేసిందని, అందువల్ల ఈ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కోరుతూ సుప్రీంకోర్టులో రఘురామరాజు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద శుక్రవారం విచారణ జరుగనుంది. జగన్ కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈ కేసులను సీబీఐ కోర్టు 3071 సార్లు వాయిదావేసింది. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది.

Also Read:వేగమే కొంపలు ముంచింది…విజయనగరం రైలు ప్రమాదం ప్రాథమిక నివేదిక

వందల కొద్దీ డిశ్చార్జి పిటిషన్లు వేశారు. డిశ్చార్జి పిటిషన్లతో కేసు విచారణ జాప్యం జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి అని రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరుపనుంది. వందల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు వేశామని ఎంపీ రఘురామరాజు చెబుతున్నారు.

11చార్జిషీటుల్లో ఏ1గా ఉన్న వైఎస్ జగన్ తాను ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నాననే సాకుతో విచారణను నుంచి తప్పించుకుంటున్నారు. ఒకటీ పది కాదు, ఏకంగా ఏడాదిన్నర కాలంగా ఆయన కోర్టు విచారణకు హాజరుకావడంలేదు. విచిత్రంగా దీనిపై సీబీఐ కూడా మౌనం దాల్చింది. ఏ న్యాయస్థానాలూ ఇదేంటని అడిగే పరిస్థితి లేకుండా పోయింది అంటున్నారు రఘురామకృష్ణంరాజు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తే.. న్యాయ వ్యవస్థ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం, ఆ విషయాన్ని దర్యాప్తు సంస్థలు, కోర్టులు పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరిస్తుండటం దారుణం. భారతంలోని ద్రౌపతీ వస్త్రాపహరణం ఘట్టంలో కౌరవులు ఏం చేసినా ఎవరూ అడ్డు చెప్పలేనట్లుగా, ఇవాళ జగన్ ఏది చేసినా వ్యవస్థలు అడ్డుకునే పరిస్థితి లేదన్నది తన అభిప్రాయం అంటున్నారు రఘురామ.

Also Read:హైదరాబాద్‌ కాంగ్రెస్ నేతల ఇళ్ళల్లో ఐటీ సోదాలు

Advertisment
తాజా కథనాలు