Raghavendra Rao: ఇక్కడ కూడా పండ్లను వదల్లేదుగా.. రాఘవేంద్రరావు న్యూఇయర్ విషెస్ ఎలా చెప్పారో చూడండి! తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. న్యూఇయర్ విషెస్ చెబుతున్న వీడియోలో ఆయన చైర్‌పై ఉండగా.. ఆయన ముందు ఉన్న టేబుల్‌పై బత్తై పండ్లు ఉన్నాయి. ఇక నిన్న రాఘవేంద్రరావు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. By Trinath 01 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి దర్శకుల్లో రాఘవేంద్రరావు(Raghavendra Rao) రూటు సపరేటు.. ముఖ్యంగా హీరోయిన్లను ఎస్టాబ్లిష్ చేయడంతో ఆయనకు మించినవారు లేరు. చాలా యూనిక్‌గా, డిఫరెంట్‌గా తన సినిమాల్లో హీరోయిన్లను ప్రజెంట్ చేస్తారు రాఘవేంద్రరావు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో మరుపురాని, తిరుగులేని విజయాలు అందించిన ఆయన సీన్స్‌లో పండ్లను ఉపయోగించడంతో ఎక్స్‌పర్ట్. ఆయన సినిమాల్లో హీరోయిన్ల శరీర భాగాలపై పండ్లు పడేవి. అదో సింబాలిక్ టైమ్ పండు అని సదరు సినీ అభిమానులు చెప్పుకుంటుంటారు. దాదాపు అన్ని పండ్లను ఆయన ఉపయోగించారని.. పుచ్చకాయ లాంటివి తప్ప అన్ని ఫ్రుట్స్‌ని సినిమాల్లో వాడేశారని ఫ్యాన్స్ చెబుతుంటారు. ఇక తాజాగా న్యూఇయర్ సందర్భంగా ఆయన తనదైన శైలిలో ప్రజలకు విషెస్ చెప్పారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు..అందరికి శుభం కలగాలని కోరుకుంటూ.. మీ రాఘవేంద్ర రావు pic.twitter.com/4m9w8hgXLm — Raghavendra Rao K (@Ragavendraraoba) January 1, 2024 'నూతన సంవత్సర శుభాకాంక్షలు..అందరికి శుభం కలగాలని కోరుకుంటూ.. మీ రాఘవేంద్ర రావు' అని ట్వీట్ పెట్టిన రాఘవేంద్రరావు క్యాప్షన్‌కు జతగా వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన చైర్‌పై కూర్చొని ఉండగా.. ముందు ఉన్న టేబుల్‌పై బత్తైకాయాలు ఉన్నాయి. ఇక రాఘవేంద్రరావు నాలుగు రాష్ట్ర నంది అవార్డులు, ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ పొందారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన చలనచిత్ర జీవితంలో, రాఘవేంద్రరావు రొమాంటిక్ కామెడీ , ఫాంటసీ , మెలోడ్రామా , యాక్షన్ థ్రిల్లర్ , జీవిత చరిత్ర లాంటి వందకు పైగా చలన చిత్రాలకు దర్శకత్వం వహించారు. రేవంత్‌ని కలిసిన రాఘవేంద్రుడు: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాతకొద్ది రోజులుగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. తాజాగా రాఘవేంద్రరావు రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, తదితర నటులు ఇప్పటికే సీఎంను మీట్ అయ్యారు. Also Read: ఈ ఏడాది భారత్ క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే.. ఓ లుక్కేయండి! WATCH: #raghavendra-rao #new-year-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి