రాఘవ్ చద్దాకు షాక్... ఫోర్జరీ సంతకాల కేసులో సస్పెన్షన్ వేటు..!

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap)ఎంపీ (mp)రాఘవ చద్దాపై సస్పెన్షన్ వేటు పడింది. సభా హక్కులను ఉల్లంఘించారన్న కారణాలపై ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఫోర్జరీ సంతకాల కేసులో దర్యాప్తు జరుపుతున్న సభాహక్కుల కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆయన పై సస్పెన్షన్ కొనసాగనుంది.

author-image
By G Ramu
New Update
రాఘవ్ చద్దాకు షాక్... ఫోర్జరీ సంతకాల కేసులో సస్పెన్షన్ వేటు..!

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap)ఎంపీ (mp)రాఘవ చద్దాపై సస్పెన్షన్ వేటు పడింది. సభా హక్కులను ఉల్లంఘించారన్న కారణాలపై ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఫోర్జరీ సంతకాల కేసులో దర్యాప్తు జరుపుతున్న సభాహక్కుల కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆయన పై సస్పెన్షన్ కొనసాగనుంది. రాఘవ్ చద్దా చర్య అనైతికమని పీయూష్ గోయల్ అన్నారు.

చద్దా ప్రవర్తన ఎవరూ ఊహించనిదన్నారు. అలాంటి ప్రవర్తన పార్లమెంటు సభ్యునికి తగదన్నారు. అనంతరం రాఘవ్ చద్దాపై పీయూష్ గోయల్ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అంతకు ముందు ఎంపీ చద్దాపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కు పలువురు ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ సర్వీసుల బిల్లుకు సంబంధించిన తీర్మానంపై తమ అనుమతి లేకుండా తమ సంతకాలను రాఘవ చద్దా ఫోర్జరీ చేసినట్టు ఐదుగురు ఎంపీలు ఆరోపించారు.

రాఘవ్ చద్దాపై ఎంపీలు సంబిత్ పాత్ర, పాంగోన్ కొన్యాక్, ఎం తంబిదురై, నరహరి అమీన్ నుంచి రాజ్య సభ చైర్మన్ కు ఫిర్యాదు అందిందని రాజ్యసభ బులెటిన్ వెల్లడించింది. ఈ ఆరోపణలను రాఘవ్ చద్దా ఖండించారు. ఒక ఎంపీ ఏ కమిటీ ఏర్పాటు కోసమైనా ఎవరి పేర్లనైనా సిఫారసు చేయవచ్చని ఆయన చెప్పారు. ఆ సమయంలో ఎవరి పేరైతో సిఫారసు చేస్తామో వాళ్ల సంతకాలు కానీ, వారి నుంచి లిఖిత పూర్వక అంగీకారం కానీ అవసరం లేదన్నారు.

‘ఉదాహరణకు నేను ఒక బర్త్ డే పార్టీ నిర్వహించాను. అందుకోసం పది మందిని ఆహ్వానించాను. అందులో ఎనిమిది మంది హాజరయ్యారు. మరో ఇద్దరికి నా ఆహ్వానం నచ్చక గైర్హజరయ్యారు. అది వాళ్ల ఇష్టం. కానీ నన్ను పార్టీకి పిలిచేందుకు మీకు ఎంత ధైర్యం అని వాళ్లు ఇప్పుడు నన్ను అడుగుతున్నారు. అసలు ఇప్పటి వరకు జరిగింది ఇదేనన్నారు. కమిటీలో చేరాలని వాళ్లకు నేను ఆహ్వానం పంపాను’అని చద్దా అన్నారు.

Advertisment
తాజా కథనాలు