Ragging: 'నార్త్‌ ఇండియా వర్సెస్ సౌత్‌ ఇండియా.. వరంగల్‌ కేఎంసీలో ర్యాగింగ్‌'

వరంగల్‌ కేఎంసీ(KMC)లో ర్యాగింగ్‌ కలకలం రేపింది. నార్త్‌ ఇండియా, సౌత్‌ ఇండియా విద్యార్థుల మధ్య గొడవలు పీక్ స్టేజీకి వెళ్లాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లాయి. ఈ దాడికి పాల్పడ్డ ఏడుగురిని కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. ఏడాదిపాటు హాస్టల్‌ నుంచి డిబార్‌ చేశారు. మరో 15 మందికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

New Update
Ragging: 'నార్త్‌ ఇండియా వర్సెస్ సౌత్‌ ఇండియా.. వరంగల్‌ కేఎంసీలో ర్యాగింగ్‌'

Ragging in warangal KMC: సీనియర్లు, జూనియర్లు, నార్త్‌ ఇండియన్లు, సౌత్‌ ఇండియన్లు.. ఇలా ఏదో ఒక కారణంతో తన్నుకోవడమే పనిగా మారింది ప్రజలకు. ఈ సీనియర్ల వర్సెస్‌ జూనియర్‌ లొల్లి దాదాపు ప్రతిచోటకూ పాకింది. ఇక అనాదిగా కాలేజీల్లో ఎలాగో ఈ గొడవలు తిష్ట వేసుకోని ఉన్నాయన్న విషయం తెలిసిందే. తాజాగా వరంగల్‌లోనూ అదే జరిగింది. కాకతీయ మెడికల్‌ కాలేజీ(kakateeya medical college)లో ర్యాగింగ్‌ కలకలం రేపింది. జూనియర్‌ స్టూడెంట్‌పై సీనియర్ల దాడి చేశారు. ఈ నెల 14న KMC ఆవరణలో బర్త్‌డే వేడుకల్లో వివాదం రాజుకున్నట్టు తేలుస్తోంది. ఫస్ట్ ఇయర్‌ స్టూడెంట్‌పై విచక్షణా రహితంగా సీనియర్ల దాడి చేశారు. మట్వాడా పోలీసులతో పాటు UGCకి బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఏడుగురు మెడికోలపై IPC 294-B, ర్యాగింగ్‌ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ర్యాగింగ్‌ జరిగినట్లు డిసిప్లీనరీ కమిటీ కూడా నిర్ధారించింది.

3నెలలు సస్పెండ్‌:
అయితే విద్యార్థులు మధ్య గొడవలో మరో యాంగిల్‌ కూడా ఉంది. అదే ప్రాంతీయతత్వం. కులాలు, మతాలు గురించి బయట ప్రజలు కొట్టుకున్నట్టు కాలేజీలో నార్త్‌ ఇండియా, సౌత్‌ ఇండియా విద్యార్థులు తన్నుకున్నారు. తాజాగా జరిగిన కొట్లాటలో ఇదే విషయం బయటపడింది. ఇది కేవలం సీనియర్ల వర్సెస్ జూనియర్ల గొడవ కాదని.. ఇందులో ఈ యాంగిల్‌ కూడా ఉందని సమాచారం. నార్త్‌ ఇండియా, సౌత్‌ ఇండియా విద్యార్థుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో విద్యార్థులకు అధికారులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. దాడికి పాల్పడ్డ ఏడుగురు విద్యార్థులను మూడు నెలల పాటు సస్పెండ్‌ చేశారు. ఏడాదిపాటు హాస్టల్‌ నుంచి డిబార్‌ చేశారు. మరో 15 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు ప్రిన్సిపాల్‌ మోహన్‌దాస్‌ చెప్పారు. కూర్చోపెట్టి వారికి కౌన్సిలింగ్ చేశామని.. మరోమారు విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ప్రిన్సిపల్‌.

ఇలా చేయవద్దు:
వరంగల్‌(Warangal) ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇలా సీనియర్లు, జూనియర్లు అంటూ గొడవ పడడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. కాలేజీలో అందరు కలిసిమెలిసి ఉండాలి. ఈగోలకు పోయి వాదన పెట్టుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఇది మన కాలేజ్ లైఫ్‌ని నెగిటివ్‌గా ప్రభావితం చేస్తుంది. అందుకు విద్యార్థులపై పడ్డ వేటు పెద్ద ఉదహరణగా చెప్పుకొవచ్చు. జూనియర్లు అంటే తక్కువ వాళ్లు కాదని సీనియర్లు తెలుసుకోవాలి.. సీనియర్లను గౌరవం ఇవ్వాలన్న విషయాన్ని కూడా జూనియర్లు తెలుసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకరికిఒకరు సపోర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. ఇక నార్త్‌ ఇండియా అయినా సౌత్‌ ఇండియా అయినా అందరూ మనుషులేనన్న విషయాన్ని మారవకూడదు. ర్యాగింగ్‌ జోలికి అసలు పోవద్దు.. భవిష్యత్‌ దెబ్బతింటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ: డిప్రెషన్‌ అంటే సినిమాలో చూపించే తాగుబోతు క్యారెక్టర్‌ కాదు బాసూ.. అది వేరే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు