Radish Face Pack: ముల్లంగిని ఇలా వాడండి.. కొద్ది రోజుల్లోనే మీ ముఖం మెరిసిపోతుంది!

ముఖాన్ని తాజాగా, అందంగా మార్చుకోవాలంటే ముల్లంగి ఫేస్ ప్యాక్ బెటర్. దీనివల్ల ముఖానికి చాలా ప్రయోజనకరంగా, చర్మం హైడ్రేట్‌గా ఉండి ముఖం సహజంగా మెరుస్తుంది. ముల్లంగితో ఫేస్ ప్యాక్‌ను ఎలా వేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Radish Face Pack: ముల్లంగిని ఇలా వాడండి.. కొద్ది రోజుల్లోనే మీ ముఖం మెరిసిపోతుంది!

Radish Face Pack: ముల్లంగి ఫేస్ ప్యాక్ ఎప్పుడైన ట్రై చేశారా..? కొద్ది రోజుల్లోనే మీ ముఖం మెరిసిపోతుంది. ముఖాన్ని తాజాగా, అందంగా మార్చుకోవాలనే ఆందోళనతో ఉంటే.. ముల్లంగిని ఉపయోగించవచ్చు. ఇది ముఖానికి చాలా ప్రయోజనకరంగా పని చేస్తుంది. చాలా మంది ముల్లంగిని ఆహారం కోసం ఉపయోగిస్తారు. కానీ మీరు దీన్ని ముఖానికి కూడా ఉపయోగించవచ్చు. ముల్లంగిలో విటమిన్లు A, C, E ,K వంటి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముల్లంగితో ఫేస్ ప్యాక్‌ను ఎలా వేసుకోవాలి.. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ముల్లంగి ఫేస్ ప్యాక్:

  • ముల్లంగి ఫేస్ ప్యాక్ చేయడానికి పెరుగును తురిమిన ముల్లంగితో బాగా మిక్స్ చేసి, ఆపై ముఖం, మెడపై 15 నిమిషాలు అప్లై చేసి శుభ్రమైన నీటితో కడగాలి.
  • ముల్లంగి రసం చేయడానికి ముల్లంగి రసంలో కొద్దిగా తేనె మిక్స్ చేసి స్ప్రే బాటిల్‌లో నింపాలి. దీన్ని 5 నుంచి 7 నిమిషాల పాటు ముఖంపై అప్లై చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • ముఖానికి ముల్లంగిని ఉపయోగిస్తే.. చర్మం హైడ్రేట్‌గా ఉండి ముఖం సహజంగా మెరుస్తుంది.
  • ముఖానికి ముల్లంగిని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఇది అలెర్జీ కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ ఫెయిలైందని అర్థం.. గుర్తుపెట్టుకోండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు