/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/radhika.jpg)
Anant Ambani - Radhika Merchant Haldi : అంబానీ ఇంట్లో రోజుకో ఫంక్షన్ జరుగుతోంది. మొన్న సంగీత్ అయితే నిన్న హల్దీ జరిగింది. ఇందులో బాలీవుడ్ (Bollywood) నటులతో పాటూ మరి కొందరు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. హల్దీ వేడుకల్లో (Haldi Ceremony) అనన్యాపాండే, ఖుషీ కపూర్ లాంటివారు సందడి చేశారు. ఇక హల్దీ కోసం పెళ్ళి కూతురు రాధికా ధరించిన పసుపు రంగు లెహంగాపై పూల దుపట్టా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
స్టైలిస్ట్ రియా కపూర్, డిజైనర్ అనామికా ఖన్నాలు రాధికా మర్చంట్ (Radhika Merchant) హల్దీ డ్రెస్‌ను డిజైన్ చేశారు. మల్లెపూలు, బంతులు కలిపి కుట్టిన పూలదప్పట్టాతో లెహంగాను తయారు చేశారు. దీని తరువాత రాధికా వేసుకున్న పింక్ కలర్ లెహంగా కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. వీటి తాలూకా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
ముంబయి (Mumbai) లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జులై 12న అనంత్- రాధికా మర్చెంట్ వివాహంతో ఒక్కటి కానున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి వీరి పెళ్ళి వేడుకలు జరుగుతున్నాయి. ఫస్ట్ ప్రీ వెడ్డింగ్, సెకండ్ ప్రీ వెడ్డింగ్...ఇప్పుడు పెళ్ళి ఇలా అన్నీ అంబానీ కుటుంబం ఘనంగా చేస్తోంది.
Also Read:Badrinath: బద్రీనాథ్ హైవేపై విరిగిపడిన కొండచరియలు..భయంతో పరుగులు పెట్టిన జనం