Qutub Minar: దేశంలో ఏప్రిల్ 19న లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాజకీయ నేతల ప్రచారాలు, బహిరంగ సభలతో దేశవ్యాప్తంగా ఎన్నికల జాతర నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ఓ వినూత్న పద్ధతి చేపట్టింది. ఢిల్లీలో ఉండే కుతుబ్ మినార్‌పై జాతీయ జెండాతో పాటు.. ఎన్నికల సంఘం లోగోను ప్రదర్శించింది. ఎలక్షన్లకు సంబంధించిన పోస్టర్లు, విజవల్స్ అన్నీ కూడా కుతుబ్ మినార్‌పై ఆకర్షణీయంగా కనిపించాయి. ఈ వీడియోను ఈసీ.. తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇదిలాఉండగా.. ఇప్పటికే దేశంలో రెండు దశల ఓటింగ్ ముగిసింది. మే3న మూడో దశ, మే 13న నాలుగు, మే 20న ఐదు, మే 25న ఆరు, జూన్ 1న ఏడో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Also Read: కొత్త ఎక్స్ ఖాతా తెరచిన కేసీఆర్.. కాంగ్రెస్‌పై ఫైర్