PVC Aadhar Rules: ఇండియాలో ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. భారత పౌరులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే UIDAI ద్వారా జారీ చేసే డాక్యుమెంట్ ఇది. ఏ ప్రభుత్వ పని అయినా లేదా ప్రభుత్వేతర పని అయినా మీకు కచ్చితంగా ఆధార్ కార్డ్ అవసరం. మీరు బ్యాంకులో అకౌంట్ తెరవాలన్నా,సిమ్ కార్డు తీసుకోవాలన్నా, మరేదైనా పని చేయాలన్నా మీకు ఆధార్ కార్డు ఉండాలి. ఇక ఇటివలీ ప్రజలు PVC ఆధార్ కార్డులను తీసుకుంటున్నారు. అయితే బయట షాపులు లేదా సైబర్ కేఫ్‌ల లాంటి ప్రదేశాల నుంచి PVC కార్డులను తయారు చేయడం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు.
చెల్లని కార్డు అవసరమా?
షాప్, సైబర్ కేఫ్ లాంటి వాటి నుంచి PVC ఆధార్ కార్డ్‌ని పొందినట్లయితే అది UIDAI ద్వారా చెల్లుబాటు కాదు. లాంటి ఏ కార్డ్ చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడదు. అలాంటి PVC ఆధార్ కార్డ్‌లలో భద్రతా లక్షణాలు లేవని UIDAI చెబుతోంది. అందుకే ఇది చెల్లదు. PVC ఆధార్ కోసం మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి కార్డ్‌ని పొందవచ్చు.
ఈ స్టెప్ ఫాలో అవ్వండి:
స్టెప్ 1:
--> మీరు PVC ఆధార్ కార్డ్ తయారు చేయాలనుకుంటే ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in ని విజిట్ చేయండి.
--> ఆపై మీకు నచ్చిన భాషను ఇక్కడ ఎంచుకోండి
--> దీని తర్వాత, 'మై ఆధార్' విభాగానికి వెళ్లి, 'ఆర్డర్ ఆధార్ PVC కార్డ్'పై క్లిక్ చేయండి.
స్టెప్ 2:
--> ఇప్పుడు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి
--> స్క్రీన్‌పై ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను కూడా పూరించండి
--> దీని తర్వాత 'Send OTP'పై క్లిక్ చేయండి
--> అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
స్టెప్ 3:
--> మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని పూరించండి
--> తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి
--> ఇప్పుడు ఆన్‌లైన్‌లో రూ.50 చెల్లించాలి
-->దీని తర్వాత, కొన్ని రోజుల్లో మీ PVC ఆధార్ కార్డ్ మీ అడ్రెస్‌కు చేరుతుంది.
Also Read: ముగ్గురు అమ్మాయిల మీద యాసిడ్ దాడి..ఎంబీఏ స్టూడెంట్ నిర్వాకం
WATCH: