PV Sindhu: ఆటలో అంతంతే.. సంపాదనలో తగ్గేదే లే! ఆటలో ఏమాత్రం కలిసి రాకున్నా ఆదాయంలో మాత్రం తగ్గేదే లేదంటోంది భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు. 2023లో సింధు ఒక్క ట్రోఫీలో కూడా విజయం సాధించలేదు. అయినా, ఈ యేడు అత్యధికంగా సంపాదించిన మహిళా అథ్లెట్ల లిస్టులో 16వ ర్యాంకులో నిలిచి ఆశ్చర్యపరిచింది. By Naren Kumar 23 Dec 2023 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి PV Sindhu: ఆటలో ఏమాత్రం కలిసి రాకున్నా ఆదాయంలో మాత్రం తగ్గేదే లేదంటోంది భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు. 2023లో సింధు ఒక్క ట్రోఫీలో కూడా విజయం సాధించలేదు. అయినా, ఈ యేడు అత్యధికంగా సంపాదించిన మహిళా అథ్లెట్ల లిస్టులో 16వ ర్యాంకులో నిలిచి ఆశ్చర్యపరిచింది. కాగా, పోలండ్ కు చెందిన టెన్నిస్ తార ఇగా స్వియాటెక్ ఈ లిస్ట్ లో టాప్ లో ఉంది. తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన వివరాలను బట్టి ఈ సంవత్సరం సింధు 7.1 మిలియన్ అమెరికన్ డాలర్లను కూడగట్టిందట. ఇది కూడా చదవండి: రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్.. వ్యూహం సినిమాకు చెక్ పెట్టిన కోర్టు కామన్వెల్త్ క్రీడల అనంతరం గాయాల భారిన పడిన సింధూ ఈ ఏడాది ఫిబ్రవరిలో కోలుకున్నప్టపికీ, ఆటలో మాత్రం ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోయింది. కొన్ని టోర్నీల్లో క్వార్టర్స్ చేరుకోవడానికే తంటాలు పడింది. మ్యాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలవడం మినహా బెస్ట్ అని చెప్పుకునే ప్రదర్శన లేదనే చెప్తున్నారు విశ్లేషకులు. 2018లో సింధు ఈ జాబితాలో టాప్-10లో చోటు దక్కించుకుని ఏడో స్థానంలో నిలిచింది. గతేడాది 12వ ర్యాంకులో ఉండగా, ఈ సారి అది 16కు చేరింది. అంతకు ముందు లిస్టులో 16వ ర్యాంకులో అమెరికా జిమ్నాస్టిక్స్ అథ్లెట్ సిమోన్ బైల్స్ (7.1 మిలియన్ డాలర్లు) ఉన్నారు. Indian #badmintonicon @Pvsindhu1 🇮🇳 has once again made the Forbes list of the world’s highest-paid women athletes. More 👉https://t.co/yWRol24rNkhttps://t.co/CgPeQlbDn3 — BWF (@bwfmedia) December 22, 2023 #pv-sindhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి