దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పివీ నర్సింహారావు

దేశాన్ని క్లిష్ట సమయంలో కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ, పివీ నర్సింహారావు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. నాడు వారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని తెలిపారు. పూర్వ భారత ప్రధాని పీవీ నరసింహరావు 102 వ జయంతి సందర్భంగా సిఎం వారి సేవలను స్మరించుకున్నారు.

New Update
దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పివీ నర్సింహారావు

PV Narsimha Rao Telangana darling who saved the nation

దేశానికే ఆదర్శం

స్థిత స్థితప్రజ్ఞతతో భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపేందుకు పునాది వేసిన దార్శనికుడు, తనదైన శైలిలో రాజనీతిని, పాలనా దక్షతను ప్రదర్శిస్తూ..దేశానికి మౌనంగా మేలు చేసిన భారత ప్రధాని పివి నర్సింహారావు అని ముఖ్యమంత్రి కొనియాడారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఘనత తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావుకే దక్కుతుందని తెలిపారు.

మీ స్పూర్తితో ముందుకు..

పీవీ నరసింహరావు సేవలను సమున్నతంగా గౌరవించుకునే బాధ్యత మన మీద ఉన్నదని, వారి గొప్పతనాన్ని గుర్తించుకునేందుకు వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం అన్నారు. తెలంగాణ ఠీవి మన పీవీ అని సీఎం పునరుద్ఘాటించారు. వారి స్పూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఘన నివాళులు

ఇక.. పీవీ నర్సింహారావు కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణి దేవి కూడా ఘన నివాళులు ఆర్పించింది. దేశం ప్రమాదపు అంచుల్లో ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు అని ఆమె అన్నారు. విదేశీ సంబంధాలను చాలా ఇంప్రూవ్ చేశారు.. అలీన విధానం ద్వారా దేశ పరిస్థితులను పూర్తిగా మార్చేశారు.. టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చేశారు.. పీవీ నర్సింహా రావుకి భారతరత్న ఇవ్వడం అంటే… భారతరత్న అవార్డుకే గౌరవం ఇచ్చినట్టు అని ఎమ్మెల్సీ సురభి వాణి దేవి తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు