Pushpa 2 : 'పుష్ప 2' నుంచి మరో అప్డేట్.. శ్రీవల్లి తో పుష్పరాజ్ డ్యూయెట్!

Pushpa 2 : 'పుష్ప 2' నుంచి మరో అప్డేట్.. శ్రీవల్లి తో పుష్పరాజ్ డ్యూయెట్!
New Update

Pushpa 2 Second Single Update : టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈసారి పార్ట్-1 కి మించి పార్ట్-2 ను ప్లాన్ చేశారు. ఇప్పటికే ‘పుష్ప 2’ (Pushpa 2) నుండి రిలీజైన గ్లింప్స్ వీడియో, ఫస్ట్ సింగిల్ అవుట్ ఫుట్స్ చూస్తే అది అర్థమవుతుంది.

కాగా రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ (First Single) భారీ రెస్పాన్స్ అందుకోగా.. ఇప్పుడు సెకెండ్ సింగిల్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఫస్ట్ సింగిల్ తో పుష్పరాజ్ ని ఇంట్రడ్యూస్ చేసిన టీమ్.. సెకెండ్ సింగిల్ తో శ్రీవల్లి (Srivalli) ని పరిచయం చేయబోతున్నారు.

శ్రీవల్లి తో పుష్పరాజ్ డ్యూయెట్

'పుష్ప 2' నుండి కాసేపటిక్రితమే సెకెండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. పుష్పరాజ్ తర్వాత ది కపుల్, శ్రీవల్లి తన సామీతో కలిసి మనందరినీ మంత్రముగ్ధులను చేసే సమయం వచ్చింది అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. బుధవారం ఉదయం 11 : 07 గం.. లకు సెకెండ్ సింగిల్ అప్డేట్ ఇస్తామని పేర్కొన్నారు. పోస్టర్ చూస్తుంటే ఈసారి పుష్పరాజ్, శ్రీవల్లీ మధ్య అదిరిపోయే డ్యూయెట్ ఉండబోతుందని అర్థం అవుతుంది.

Also Read : తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి.. ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేసిందిగా!

#srivalli-2-0 #allu-arjun #pushpa-2-second-single
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe