/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-08T153528.707-jpg.webp)
Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో సపోర్టింగ్ రోల్ లో నటించిన కేశవ( జగదీశ్) ఇటీవలే మహిళా వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో ఫుల్ లెన్త్ రోల్ లో నటించాడు . ఈ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా "ఏందీ మచ్చా" అంటూ కేశవ పాత్రలో నటించిన జగదీశ్ కు మంచి గుర్తింపు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప బ్లాక్ బస్టర్ కావడంతో జగదీశ్ కు సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. పుష్ప సీక్వెల్ పుష్ప 2 లో కూడా జగదీశ్ నటిస్తున్నాడు.
Also Read: Pushpa Actor Jagadeesh: మహిళా వేధింపుల కేసులో.. ‘పుష్ప’ యాక్టర్ జగదీశ్ అరెస్ట్
అయితే తాజాగా జగదీశ్ అరెస్ట్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ మొదలైంది. ప్రస్తుతం పుష్ప షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ షూట్ కు సంబంధించిన ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పుష్ప 2 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాలో నటించిన జగదీశ్ అరెస్ట్ కావడంతో రిలీజ్ లేట్ అయ్యే అవకాశం ఉందేమోనని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 లో జగదీశ్ పాత్రకు సంబంధించిన చాలా సన్నివేశాలు ఇంకా షూట్ చేయాల్సి ఉందంట. ఇక ఈ విషయం పై పలు రకాల చర్చలు వినిపిస్తున్నాయి. అయితే జగదీశ్ బెయిల్ నుంచి బయటకు వచ్చాక మిగతా షూట్ జరిగే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్. కానీ మరికొందరు జగదీశ్ పాత్రను రీప్లేస్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని పై చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: Naga Chaitanya: నాగచైతన్య లైన్ క్లియర్.. సమంత పరిస్థితేంటి?