Pushpa 2 : యూట్యూబ్ ను షేక్ చేసిన 'పుష్ప పుష్ప' సాంగ్.. ఏకంగా అన్ని మిలియన్ల వ్యూస్?

'పుష్ప 2' ఫస్ట్ సింగిల్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఈ పాట ఏకంగా 100 మిలయన్లకి పైగా వ్యూస్ అందుకుని చార్ట్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి ఈ సాంగ్ కి 2.26 మిలియన్స్ లైక్స్ రావడం విశేషం.

Pushpa 2 : యూట్యూబ్ ను షేక్ చేసిన 'పుష్ప పుష్ప' సాంగ్.. ఏకంగా అన్ని మిలియన్ల వ్యూస్?
New Update

Pushpa 2 First Single Creates New Record : టాలీవుడ్ మోస్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన పుష్ప 2 రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియా అంతటా ట్రెండింగ్ లో నిలిచి సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. ఇక రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఓ రేర్ ఫీట్ అందుకుంది.

'పుష్ప' సాంగ్ కి 100 మిలియన్స్ వ్యూస్

పుష్ప 2 మూవీని ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. పుష్ప పుష్ప అంటూ ఫుల్ మాస్ బీట్ తో సాగిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఈ పాట ఏకంగా 100 మిలయన్లకి పైగా వ్యూస్ అందుకుని చార్ట్ బస్టర్ గా నిలిచింది.

Also Read : ఎట్టకేలకు కొత్త సినిమా అనౌన్స్ చేసిన గుణశేఖర్.. ఆసక్తికరంగా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో!

అంతేకాదు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి ఈ సాంగ్ కి 2.26 మిలియన్స్ లైక్స్ రావడం విశేషం. ఈ రికార్డ్ తో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా సెకెండ్ సింగిల్ ని రేవు ఉదయం 11. 07 గం.. లకు రిలీజ్ చేస్తున్నారు. 'సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి' అంటూ సాగే ఈ పాట కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#pushpa-pushpa-song #pushpa-2-the-rule
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe