Pushpa 2 : సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.. 'సామి సామి' సాంగ్ ను మించి ఉందిగా!

'పుష్ప 2' సెకెండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. దీనికోసం రష్మికతో స్పెషల్ వీడియోని షూట్ చేశారు. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

New Update
Pushpa 2 : సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.. 'సామి సామి' సాంగ్ ను మించి ఉందిగా!

Pushpa 2 Second Single Announcement Video : టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈసారి పార్ట్-1 కి మించి పార్ట్-2 ను ప్లాన్ చేశారు. కాగా రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ భారీ రెస్పాన్స్ అందుకోగా.. ఇప్పుడు సెకెండ్ సింగిల్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఫస్ట్ సింగిల్ తో పుష్పరాజ్ ని ఇంట్రడ్యూస్ చేసిన టీమ్.. సెకెండ్ సింగిల్ తో శ్రీవల్లిని పరిచయం చేయబోతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సెకెండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. దీనికోసం రష్మికతో స్పెషల్ వీడియోని షూట్ చేశారు.

Also Read : ఆ డైరెక్టర్ నన్ను చంపేస్తానని బెదిరించాడు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన లయ!

'సామి సామి' సాంగ్ ను మించి

తాజాగా రిలీజ్ చేసిన స్పెషల వీడియోలో.. " ఓ శ్రీవల్లి వదినా..పుష్ప 2 నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌ చేస్తున్నారట కదా.. ఆ పాట ఏంటో చెబుతావా’ అని చిత్తూరు యాసలో ఓ వ్యక్తి అడగ్గా.. మేకప్‌ వేసుకుంటున్న రష్మిక వచ్చి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ తో అదరగొట్టింది. ఈ సాంగ్‌ని మే 29న ఉదయం 11.07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నట్లు వీడియో చివర్లో తెలిపారు. ఈ వీడియోని బట్టి చుస్తే సెకెండ్ సింగిల్ పుష్ప లోని సామి సామి సాంగ్ ను మించి ఉంటుందని అర్థమవుతుంది.

Advertisment
తాజా కథనాలు